నిందితుడిగా గుర్తించాలంటే ఏం కావాలి?

ఒకే సంఘటన ఆధారంగా నేరాలను పరిగణించలేం. ఒక వ్యక్తిపై సరైన ఆధారాలు లేకపోతే నిందితుడిగా గుర్తించలేం

Update: 2023-12-07 17:30 GMT

ఒకే సంఘటన ఆధారంగా నేరాలను పరిగణించలేం. ఒక వ్యక్తిపై సరైన ఆధారాలు లేకపోతే నిందితుడిగా గుర్తించలేం. దానికి సరైన ఆధారాలు కావాలి. అతడిని నిందితుడిగా గుర్తించే పక్కా సాక్ష్యాలు కావాలి. లేకపోతే అతడిని నిందితుడిగా తేల్చలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడటం సమంజసం కాదనేది న్యాయసూత్రం. దీని ప్రకారం ఒక వ్యక్తి మీద ఆపాదించే నేరం రుజువు కాకపోతే అతడిని నిందితుడిగా గుర్తించలేమని చెప్పింది.

ఓ వివాహిత తన భర్త, అతడి సోదరి, మరో ఇద్దరు బంధువులపై ఐపీసీ సెక్షన్లు 498ఎ, 506 వరకట్న నిషేధ చట్టం కింద మోపిన నేరాభియోగాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుదారు ఆరోపణలు చాలా సాధారణంగా నమ్మశక్యం కాకుండా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వి.ఎస్.భట్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది

తమపై మోపిన అభియోగాలను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడానికి నిరాకరించగా దాన్ని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారి వాదనలు సరైనవని తేల్చింది. వారి పక్షాన తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు ప్రవేశపెట్టకపోవడంతో వారి వాదన కరెక్టు అని తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అందరిలో ఆలోచనలు రేకెత్తించింది.

చాలా కేసుల్లో ఇలాగే జరుగుతోంది. నిజానిజాలు గుర్తించి తీర్పు ఇవ్వడం కాదు సాక్ష్యాలు చూసి తీర్పునిచ్చే ధర్మాసనం కల్పించిన సెక్షన్లను నిందితులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు ఉండటం సహజమే. ఈ క్రమంలో కోర్టు తీర్పు నిజమైనదా? కాదా? అనే తీర్పు సాక్ష్యాలకనుగుణంగానే ఉంటుంది. బలమైన ఆధారాలు ఉంటేనే కేసు నిలబడుతుంది. లేదంటే తీర్పు మరోలా ఉండటం కామనే.

Tags:    

Similar News