ఫేక్ పోలీస్... పంజాగుట్టలో రూ.18.5లక్షలు కొట్టేశారు!
వివరాళ్లోకి వెళ్తే... సురేష్ అగర్వాల్ అనే వ్యక్తి మెహదీపట్నంలో గత కొన్నేళ్లుగా వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని దగ్గర పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి రూ.20 లక్షల నగదును తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు.
తెలంగాణలో ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. మరోపక్క పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణలో రహదారులన్నీ జల్లెడపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల్లో పూర్తి నిఘా ఉంచారు. ఈ సమయంలో నకిలీలు ఎంటరయ్యారు! వారీ పనులు వారు చక్కబెట్టేస్తున్నారు.
అవును... తెలంగాణలో పోలీసుల తనిఖీలలో లక్షల రూపాయలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల కోట్ల రూపాయలు సైతం పట్టుబడుతున్నాయి. అయితే వీటిలో సరైన పత్రాలు, ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించని పక్షంలో... వాటికి పోలీసులు మీడియాకు చూపించి, అనంతరం సీజ్ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపించిన వారికి తిరిగి వారి డబ్బు వారికి ఇచ్చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఇదరు నకిలీ పోలీసులు రంగంలోకి దిగారు. ఒక వ్యక్తి నుంచి 18.5 లక్షలు కాజేశారు. అనంతరం విషయం గ్రహించిన సదరు వ్యక్తి.. పొలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ దోపిడీపై వేగంగా విచారణ చేపట్టారని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... సురేష్ అగర్వాల్ అనే వ్యక్తి మెహదీపట్నంలో గత కొన్నేళ్లుగా వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని దగ్గర పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి రూ.20 లక్షల నగదును తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోలీసు దుస్తుల్లో ఉన్న దుండగులు జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ సమీపంలో కారును ఆపి తనిఖీలు చేస్తున్నట్లుగా నటించారు. ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని, తమ వాహనంలో తమతో రావాలని బలవంతం చేశారు.
దీంతో వారి వాహనంలో ఎక్కిన అనంతరం కారు ఖైరతాబాద్ వరకూ చేరుకునే సరికి ప్రదీప్ బ్యాగ్ అతనికి తిరిగి ఇచ్చేసిన నిందితులు.. అతడిని దింపి వెళ్లిపోయారట. తీరా ఆ వాహనం దిగిన తర్వాత చూసుకుంటే... అందులో కేవలం రూ. 1.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రూ. 18.5 లక్షలు మాయమైపోయాయి!
దీంతో హుటాహుటిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రదీప్ శర్మ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో... కేసు నమోదు చేసుకున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ పోలీసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు!