పెళ్లై 16 ఏళ్లు.. 4 పిల్లల తండ్రి విడాకుల కారణం తెలిస్తే షాకే
వారిద్దరిది ప్రేమ పెళ్లి. అనురాగ దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు జన్మించారు.
వారిద్దరిది ప్రేమ పెళ్లి. అనురాగ దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు జన్మించారు. కాలం హాయిగా సాగిపోతోంది. నలుగురు పిల్లల తండ్రిగా ఆయన ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఎందుకు వచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ ఏదో అనుమానం. దాంతో నలుగురు పిల్లలకు డీఎన్ఏ పరీక్ష చేసుకున్నాడు. కట్ చేస్తే.. తాజాగా విడాకుల కోసం పోరాడుతున్న అతడి ఉదంతం చైనాలో సంచలనంగా మారింది. విన్నంతనే ఉలిక్కిపడే షాకింగ్ న్యూస్ ఏమంటే.. నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరికి తాను తండ్రిని కాకపోవటం ఆ పెద్ద మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. మరీ, ఇంత అన్యాయమా? అంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
చెన్.. యూలు భార్యభర్తలు. పెళ్లై పదహారేళ్లు గడిచిన వేళ.. ఆయనకు ఒక నిజం తెలిసింది. తన నలుగురు పిల్లలకు తాను తండ్రిని కాదని ఆయన గుర్తించారు. శాస్త్రీయంగా డీఎన్ఏ పరీక్ష చేయించుకొని మరీ.. నిజం తెలుసుకున్న ఆయన.. పదహారేళ్లుగా తనను ఇంత దారుణంగా మోసం చేసిన భార్యపై విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. పెళ్లైనప్పటి నుంచి తన భార్య తనను మోసం చేస్తూనే ఉందన్న విషయాన్ని ఆయన వాపోతున్నాడు.
నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరి డీఎన్ఏ తనతో మ్యాచ్ కాకపోవటాన్ని జీర్ణించుకోలేని ఆయన.. తనకు పుట్టని పిల్లల కోసం తన సంపాదన మొత్తం ఎందుకు ఖర్చు చేయాలన్న పాయింట్ తో ఆయన కోర్టులో కేసును వాదిస్తున్నాడు. ఇదే సమయంలో నలుగురు పిల్లల తండ్రి మరెవరో కాదని.. తన వ్యక్తిగత లాయర్ ‘వు’పైన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. తమకు తొలి సంతానం పుట్టినప్పుడు పరామర్శకు అందరికంటే ముందు అతడే ముందు వచ్చాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత పుట్టిన ముగ్గురు పిల్లలకు కూడా తండ్రి ‘వు’నే అవుతాడన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు.
తనకు పుట్టని పిల్లల కోసం ఇంతకాలం తాను చేసిన ఖర్చుల్ని కూడా తనకు తిరిగి చెల్లించేలా చేయాలని కోర్టును కోరుతున్నాడు. చైనాలో సంచలనంగా మారిన ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా.. భర్తను పదహారేళ్లుగా మోసం చేసిన ఆ ‘మహాతల్లి’ వాదన ఏమై ఉంటుందన్న అంశం గురించి మాట్లాడుకుంటున్నారు.