భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు...అలెర్ట్ కావాల్సిందే !

భారత్ అయితే విదేశీ విమానాల ద్వారా వచ్చే వారిని నేరుగా ఎయిర్ పోర్టులలోనే తనిఖీలు చేస్తూ అప్రమత్తం అవుతోంది.

Update: 2024-09-09 15:14 GMT

మంకీ పాక్స్ అక్కడో ఇక్కడో అనుకుని వచ్చిన వారికి దేశంలోకి అది ప్రవేశించింది అన్నది తెలిసి కలవరపడుతున్నారు. మంకీ పాక్స్ ముప్పు మనకు లేదని ధీమాగా ఉన్న వారికి ఇది నిజంగా అలజడి రేపే అంశమే. నిజానికి చూస్తే మంకీ పాక్స్ గురించి గత కొంతకాలంగా విపరీతంగా ప్రచారం సాగుతోంది. భారత్ అయితే విదేశీ విమానాల ద్వారా వచ్చే వారిని నేరుగా ఎయిర్ పోర్టులలోనే తనిఖీలు చేస్తూ అప్రమత్తం అవుతోంది. అయితే ఇప్పటిదాకా ఆఫ్రికా యూరోపియన్ దేశాలలోనే మంకీ పాక్స్ ఉందని భావించారు.

కానీ అది దేశంలోకి ప్రవేశించింది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన ఉనికిని భారత్ లో కనుగొన్నామని ఆ శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ వచ్చిందని నిర్ధారించింది.

బాధితుడిని ఐసోలేషన్ లో ఉంచి టెస్టులు చేయగా ఇది వెల్లడి అయింది.ఆ రోగికి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ టూ రకం మంకీ పాక్స్ వచ్చినట్లుగా పేర్కొంది. అయితే ఆ రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా పేర్కొంది. అదే సమయంలో దేశంలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం మంకీ పాక్స్ వల్ల లేదని పేర్కొంటూనే అప్రమత్తంగా ఉండాలని కేంద్రం దేశంలోని వివిధ రాష్త్రాలను కోరింది.

ప్రతీ రాష్త్రంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయలని టెస్టింగులు చేయాలని కూడా సూచించింది. ఇదిలా ఉండగా 2022 జులై నుండి భారతదేశంలో ఇప్పటిదాక 30 కేసులు ఈ విధంగా నమోదు అయ్యాయని ఇది కూడా అందులో ఒకటి అని పేర్కొంది. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విధంగా చూస్తే మంకీ పాక్స్ క్లాడ్ వన్ హెల్త్ ఎమర్జెన్సీకి చెందిన కేసు కాదని కూడా పేర్కొంది.

Tags:    

Similar News