గల్లా జయదేవ్ ఆ ఒక్క తప్పూ చేయకపోతే ?
గల్లా ఎందుకో పాలిటిక్స్ కి బ్రేక్ ని చెప్పారని, అది రాంగ్ డెసిషన్ అని ఇపుడు అర్ధమవుతోందని అంటున్నారు.
గల్లా జయదేవ్ ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి పరిచయం చేయనవసరం లేని పేరు. ఆయన పారిశ్రామికవేత్త. పైగా ఆయనది రాజకీయంగా ప్రముఖ నేపథ్యం ఉన్న కుటుంబం. ఇక దివంగత సూపర్ స్టార్ క్రిష్ణ పెద్దల్లుడిగా ఉన్నారు. ఆయన తన రాజకీయాన్ని టీడీపీ ద్వారానే ప్రారంభించారు.
ఆయన 2014లో టీడీపీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో జగన్ వేవ్ తట్టుకుని గెలిచిన ముగ్గురు ఎంపీలలో ఆయన ఒకరు. ఆయనను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు నియమించారు. అలా పార్టీ ఆయనను సమాదరించింది.
అయితే గల్లా జయదేవ్ 2019 తరువాత కొన్నాళ్ళు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నా ఆ తరువాత మాత్రం ఎందుకో దూరం అయ్యారని ప్రచారం సాగింది. ఇక 2024 ఎన్నికల ముందు ఆయన స్వయంగా ప్రకటన చేసి కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు గుడ్ బై అని చెప్పి సంచలనం సృష్టించారు.
దాంతో టీడీపీ హై కమాండ్ గుంటూరు ఎంపీ సీటు కోసం ఎన్నారై అయిన పెమ్మసాని చంద్రశేఖర్ ని తెచ్చి టికెట్ ఇచ్చింది. ఆయన వేలాది కోట్లు ఉన్న అపర కుబేరుడు. ఆయనకు సడెన్ గా దక్కిన చాన్స్ కి ఎంచక్కా ఉపయోగించుకుని గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టారు. అదే ఊపులో ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోయారు.
దాంతో రాజకీయంగా ఆయన పాతుకుపోయేందుకు మార్గం ఏర్పడింది. ఇపుడు ఆయన లక్ చూసి గల్లా అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్లా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఈపాటికి ఆయనే కేంద్ర మంత్రి కదా అని కూడా చర్చించుకుంటున్నారు.
గల్లా ఎందుకో పాలిటిక్స్ కి బ్రేక్ ని చెప్పారని, అది రాంగ్ డెసిషన్ అని ఇపుడు అర్ధమవుతోందని అంటున్నారు. గల్లాకి టీడీపీ ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే గల్లా 2029 ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా సరైన నియోజకవర్గం లేదని అంటున్నారు. గుంటూరుకు పెమ్మసాని కన్ఫర్మ్ అని. అలాగే విజయవాడకు కేశినేని చిన్ని కుదురుకున్నారని విశాఖ ఎంపీగా బాలయ్య అల్లుడు శ్రీభరత్ పర్మనెంట్ అని అంటున్నారు.
దాంతో ఆయనకు రాజ్యసభ మాత్రమే గేట్ వే అయ్యేలా ఉంది అని అంటున్నారు. ఇంత జరిగినా చంద్రబాబుకు టీడీపీ పెద్దలకూ ఆయన అంటే అభిమానం ఉందని అందుకే ఆయనకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఇస్తారని ప్రచారం సాగుతోంది అని అంటున్నారు. ఇక బాబు మరింతగా ప్రేమ చూపిస్తే 2026 నాటికి పెద్దల సభలో గల్లా కనిపించవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్ర మంత్రి పదవి దగ్గరగా వచ్చిన వేళ గల్లా కోరి వదిలేసుకున్నారా అన్న చర్చ మాత్రం నడుస్తోంది.