భారీగా పెరిగిన బంగారం ధర... కారణం ఇదేనని తెలుసా?

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీ స్థాయిలో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-04-01 07:25 GMT
Gold Rates Increased

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ కొత్త ఏడాదిలో అయితే పసిడి ధరలు పరుగులు పెట్టేస్తున్నాయి. ఏ రోజు ఎంత మేర పెరుగుందనేది సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తోన్న పరిస్థితి. అయితే... ప్రధానంగా ఈ ఏడాదిలో బంగారం ధరలు ఈ స్థాయిలో ఆల్ టైం గరిష్టానికి చేరడానికి గల కారణాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీ స్థాయిలో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం రోజుల్లోనే ధరలు వరుసగా పెరిగిన పరిస్థితి. ఇందులో భాగంగా.. 24 క్యారెంట్స్ గోల్డ్ రేటు సోమవారం రూ.710 పెరగగా.. ఈ రోజు రూ.930 పెరిగింది. ఇక 22 క్యారెట్ విషయానికొస్తే సోమవారం పెరుగుదల రూ.650 కాగా... నేటి పెరుగుదల రూ.850.

ఫలితంగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర 92వేల మార్కును దాటేసి, 93 వేల మార్కు వైపు పరుగులు పెడుతోంది. ఫలితంగా.. ఆల్ టైం గరిష్టానికి దూసుకెళ్తోంది. ఈ సమయంలో... ఈ స్థాయిలో బంగారం ధరలు దూసుకెళ్లడానికి గల కారణాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగానే ఉంటున్నాయి. అందులో పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయని అంటున్నారు. అలాంటి ప్రకటనలే పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. ఫలితంగా వరు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నరని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ (28.34 గ్రాముల) బంగారం ధర 3,115 డాలార్లు (సుమారు రూ.2.67 లక్షల) ను అధిగమించిన పరిస్థితి. పరిస్థితులు ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో ఔన్స్ గోల్ద్ ధర 3,200 డాలర్లు (సుమారు రూ.2.73 లక్షల) మార్కును దాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

దీంతో... అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతుంది. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటం కూడా బంగారం ధరల భారీ పెరుగుదలకు కారణమవుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే రాబోయే కాలంలో బంగారం ధరలు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు.. నేను ఏమైనా తక్కువ తిన్నానా అన్నట్లుగా బంగారం బాటలోనే పయనిస్తోంది వెండి కూడా. ఇందులో భాగంగా... తాజాగా కిలో వెండిపై రూ.1000 పెరగడంతో.. నేడు బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,05,000గా నమోదైంది.

Tags:    

Similar News