ఈ కోడలు మామూలుది కాదు..అత్తను ఈడ్చి కొట్టింది, మొగుడిని చితకబాదింది!

కోడలు తమ ఆస్తిని లాక్కోవాలని చూస్తోందని, అందుకే తనను ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపించాలని ప్రయత్నిస్తోందని సర్లా ఆరోపించింది.;

Update: 2025-04-06 06:02 GMT
ఈ కోడలు మామూలుది కాదు..అత్తను ఈడ్చి కొట్టింది, మొగుడిని చితకబాదింది!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె కోడలు దారుణంగా కొట్టింది. అంతేకాదు, ఆమెను నేలకేసి కొట్టి, ఈడ్చి, గోడకేసి బాదింది. కొడుకు అడ్డుకోబోతే, తన వాళ్లను పిలిపించి మరీ భర్తను చితకబాదింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోడలి కుటుంబ సభ్యులకు, ఆమె భర్త తల్లిదండ్రులకు మధ్య ఇంట్లో గొడవ జరిగింది. కోడలు తన భర్త తల్లిదండ్రుల ఇంటికి మనుషుల్ని పిలిపించి, తన భర్తను కూడా కొట్టించింది.

బాధితురాలి పేరు సర్లా బత్రా (70). ఆమె తన కొడుకు విశాల్, కోడలు నీలికా, మనవళ్లతో కలిసి ఉంటోంది. కోడలు తమ ఆస్తిని లాక్కోవాలని చూస్తోందని, అందుకే తనను ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపించాలని ప్రయత్నిస్తోందని సర్లా ఆరోపించింది. ఘటన జరిగిన రోజు, కోడలు చిన్న ఇంటి విషయమై అత్తగారితో గొడవ పెట్టుకుంది. కొడుకు అడ్డుకోడానికి ప్రయత్నించగా నీలికా తన తండ్రిని, తమ్ముడిని పిలిచింది. వాళ్లు ఇంట్లోకి చొరబడి సర్ల బత్రాను తిట్టడమే కాకుండా ఆమె కొడుకును కూడా కొట్టడం మొదలుపెట్టారు.

అత్తగారు కొడుకును కాపాడటానికి ప్రయత్నించగా నీలిమా ఆమెను కొట్టి, నేలకేసి కొట్టింది. కాళ్లతో తన్ని, తలను గోడకు బాదింది. ఫిర్యాదు చేస్తే చంపేస్తామని కూడా బెదిరించారని సమాచారం. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చూపించినా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. నిందితుల ఒత్తిడి వల్లే వారు అలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బాధితులు పెద్ద పోలీసు అధికారులను ఆశ్రయించడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

గ్వాలియర్ డీఎస్పీ రాబిన్ జైన్ ఈ ఘటనపై స్పందించారు. "ఆదర్శ్ కాలనీలో 1-2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. వైరల్ వీడియోలో ఒక కోడలు తన అత్తగారిని, భర్తను కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. శారీరక హింసపై అధికారిక ఫిర్యాదు అందింది. మేము కేసు నమోదు చేశాము," అని ఆయన అన్నారు.

Tags:    

Similar News