మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌కు గుండెపోటు.. కండీషన్ క్రిటికల్
అయితే.. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ ఉగ్రవాద సంస్థ ఏళ్ల తరబడిగా తెగబడుతూనే ఉంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ గురించి కీలక అప్‌డేట్ వెలుగుచూసింది. భారత మోస్ట్ వాంటెడ్ జైషే అధినేత మసూద్ అజార్ హెల్త్ గురించి బిగ్ బ్రేకింగ్ అందింది.
టెర్రరిస్ట్ మసూద్ అజార్ 1968లో జన్మించాడు. అజార్ పూర్తిపేరు మౌలాన్ మసూద్ అజార్. పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌లో అనేక ఉగ్రవాద ఘటనలకు తెగబడ్డాడు. ‘జైష్-ఏ-అహ్మద్’ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించిన మసూద్.. తన కార్యకలాపాలను భారత్‌లోనే కాకుండా అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు తదితర దేశాలకు విస్తరించాడు. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ఈ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది.
అయితే.. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ ఉగ్రవాద సంస్థ ఏళ్ల తరబడిగా తెగబడుతూనే ఉంది. మసూద్ అజార్ భారత్‌కు పూర్తి వ్యతిరేకం. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన సంస్థ ప్రసిద్ధి. అయితే.. కొన్నేళ్లుగా ఆయన పాకిస్థాన్‌లో ఉన్నాడని చెబుతున్నా పాకిస్థాన్ మాత్రం నిరాకరించింది. తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. అతడు పాకిస్థాన్‌లోనే ఉన్నాడని ఎట్టకేలకు ఆ దేశం అంగీకరించింది.
హార్ట్ స్ట్రోక్ రాగానే అతడిని ఆప్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు తరలించారు. ప్రస్తుతం మసూద్ కరాచీలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్‌లో చేరాడు. కాగా.. అతని ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ అప్‌డేట్ ఏమీ రాలేదు. ఇస్లామాబాద్ నుంచి కార్డియాలజిస్టులు కరాచీకి చేరుకుంటున్నట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. ఆయనను త్వరలో రావల్పిండిలోని అతిపెద్ద, అత్యంత సౌకర్యాలతో కూడిన సైనిక ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సెప్టెంబర్ 2019లో అజహర్ అనే మరో పాకిస్థానీ ఉగ్రవాది, లష్కరో తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహ్మద్ సయిద్‌ను భారతదేశం ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద ఉగ్రవాదులుగా ప్రకటించింది. కాగా.. 199లో ఖాట్మండు నుంచి కాందహార్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్‌ను జైలు నుంచి విడుదల చేసింది.