హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్

ఉగాది పండక్కి ఒక్కరోజు ముందు హైదరాబాద్ లోని ఒక సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.;

Update: 2025-03-30 05:35 GMT
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్

ఉగాది పండక్కి ఒక్కరోజు ముందు హైదరాబాద్ లోని ఒక సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ గా పేరున్న పింకీ సూసైడ్ ఇప్పుడు షాకిచ్చేలా మారింది. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది.

ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తిని పెళ్లాడిన పింకీ.. ఆత్మహత్య చేసుకోవటానికి కుటుంబ కలహాలే కారణమని చెబుతున్నారు. పింకీ ఆత్మహత్యకు భర్త వేధింపులు కారణమా? మరేదైనా కారణం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత వీరి వైవాహిక జీవితం కొంతకాలం బాగానే సాగిందని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య కలహాలు మొదలైనట్లుగా చెబుతున్నారు.

ఆ తర్వాత నుంచి పింకీకి భర్త నుంచి వేధింపులు ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. కొన్నిసార్లు పింకీ భర్త విపరీత ధోరణిని ప్రదర్శించేవారని చెబుతున్నారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు పింకీని ఇంట్లోనే ఉంచి.. బయట తాళం వేసి వెళ్లేవాడని చెబుతున్నారు. శుక్రవారంరాత్రి కూడా పింకీకి.. అమిత్ కు మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగినట్లుగా తెలసు్తోంది. ఈ నేపథ్యంలో పింకీని ఇంట్లో ఉంచేసి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడని.. అతను తిరిగి వచ్చేసరికి చున్నీతో పింకీ శర్మ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించారు.

స్థానికుల సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పింకీ డెడ్ బాడీని శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసుల విచారణలో పింకీ ఆత్మహత్యకు అసలు కారణాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.

Tags:    

Similar News