100 కోట్ల ఓటర్ల దిశగా భారత్.. అరుదైన ఘనత సొంతం

ఇదిలా ఉంటే భారత్ ప్రస్తుతం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ అవతరించింది.

Update: 2025-01-23 05:19 GMT

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. కరోనా వల్ల 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పటివరకు జరగలేదు. అయితే అనధికారికంగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ టాప్ లోకి చేరినట్లు చెబుతున్నారు.

భారత్ జనాభా ప్రస్తుతం సుమారు 140 నుంచి 150 కోట్ల మధ్య ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం చైనా జనాభాను భారత్ ఎప్పుడో దాటేసింది. ఇదిలా ఉంటే భారత్ ప్రస్తుతం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ అవతరించింది. భారతదేశంలో సుమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో 99.1 కోట్ల మంది జనాభా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.

గడిచిన ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది యువతే ఉండడం గమనార్హం. గడిచిన ఆరు నెలల్లో మరో రెండున్నర కోట్ల మంది జనాభా పెరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత దేశ ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. వీరులో దాదాపు 21.7 కోట్ల మంది ఓటర్లు 18 నుంచి 29 ఏళ్లలోపు వయసు వారే ఉండడం విశేషం. భారత త్వరలోనే 100 కోట్ల మంది ఓటర్లతో రికార్డు సృష్టిస్తుందని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానీ రికార్డును భారత సొంతం చేసుకోబోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 100 కోట్ల మంది ఓటర్లు ఉండడం అంటే సాధారణ విషయం కాదు. భారత్ అనేక దేశాల ప్రజల సంఖ్యతో సమానంగా ఓటర్ల సంఖ్య పెరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం కూడా ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. 100 కోట్ల మార్కును కొద్ది రోజుల్లోనే భారతం చేరుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రాల వారీగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం వెల్లడించాల్సి ఉంది. అనధికారికంగా చూస్తే ఉత్తరప్రదేశ్ అత్యధిక ఓటర్లతో టాప్ లో ఉంటుందని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ తరువాత జాబితాలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉంటాయని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రాలు వారీగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News