సముద్రంలో అతిపెద్ద ఆపరేషన్... రూ.36,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం!

దేశ చరిత్రలోనే సముద్రంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

Update: 2024-11-27 07:13 GMT

న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతోన్న వేళ మాదక ద్రవ్యాల తరలింపు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో అత్యంత భారీ డ్రగ్స్ ని ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకొంది. దేశ చరిత్రలోనే సముద్రంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీని విలువ రూ.36,000 కోట్లని అంటున్నారు.

అవును.. అండమాన్ నికోబార్ దీవులలో మత్స్యకారుల పడవల్లో సుమారు 36,000 కోట్ల రూపాయలు విలువైన 6,000 కిలోల "మెథాంఫెటమైన్" ను స్వాధీనం చేసుకున్నారు. బైరాన్ ద్వీపం సమీపం నుంచి థాయిలాండ్ లోకి ఈ నిషేధిత డ్రగ్స్ ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు చెబుతున్నారు.

దీనిపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరగోబిందర్ సింగ్ ధాలివాల్... ఫిషింగ్ ట్రాలర్ లోని సాంకేతిక సమస్య వల్ల థాయిలాండ్ వైపు వెళ్లకుండా భారతీయ జలాల వైపు మళ్లినట్లు తెలిస్తోందని అన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మయన్మారీలపై ఎన్.డీ.పీ.సీ చట్టం 1985, ఫారినర్స్ యాక్ట్ 1946లోని వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సందర్భంగా థాయిలాండ్ లో ఇటువంటి డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. టీ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్ ని ప్యాక్ చేశారని.. నిందితులందరినీ స్థానిక కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పోలీసు కస్టడీకి పంపించినట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో రోహింగ్యా బోట్లు, మయన్మారీస్ నౌకల ఆచూకీ ఎక్కువ కావడంతో పోలీసులు, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా గాలింపు చరలు చేపట్టినట్లు డీజీపీ వెల్లడించారు. మరోపక్క నిందితులు విచారణకు సహకరించడం లేదని.. అరెస్ట్ చేసిన వారి నుంచి శాటిలైట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, మరింత సమాచారం సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News