వైర‌ల్ వీడియో: ఇదేం పెళ్లి ఫోటోషూట్ బాబోయ్

అలాంటిది ఇప్పుడు మ‌న సంస్కృతి సాంప్ర‌దాయం పాశ్చాత్య ధోర‌ణికి షిఫ్ట‌వ్వ‌డం తీవ్రంగా క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

Update: 2024-10-04 02:30 GMT

భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప గౌర‌వం గుర్తింపు ఉన్నాయి. భార‌తీయ సాంప్ర‌దాయంలో పెళ్లి చేసుకోవాల‌ని విదేశీ యువ‌తీ యువ‌కులు క‌ల‌లుగంటారు. అలాంటిది ఇప్పుడు మ‌న సంస్కృతి సాంప్ర‌దాయం పాశ్చాత్య ధోర‌ణికి షిఫ్ట‌వ్వ‌డం తీవ్రంగా క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఈ జంట చేసిన ప‌ని సిగ్గు చేటుగా మారింది. ఇలా ఒక కెమెరా త‌మ‌ను రికార్డ్ చేస్తున్న విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఒక‌రితో ఒక‌రు వ‌ధూవ‌రులు పెద‌వి ముద్దుల్లో మునిగిపోయారు. ప‌బ్లిక్ గా ఇలా పెద‌వి తాంబూలం పుచ్చుకుంటూ మైమ‌రిచిపోయారు. ఆ స‌మ‌యంలో ఘాడంగా హ‌గ్ చేసుకునేందుకు రెడీ అయ‌పోయారు. ఈ మొత్తం వీడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇది హద్దులు దాటిపోయింద‌ని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. భార‌త‌దేశంలో ఇలాంటి ప్రీవెడ్డింగ్ షూట్ గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌లో ఈ చర్యను ఖండిస్తూ ప్రేక్షకుల్లోని సంప్రదాయవాదులు ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసారు.

ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్‌లు భారతీయ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఇలాంటివి త‌ల్లిదండ్రుల‌కు కూడా మాయని మ‌చ్చ‌గా మారుతున్నాయి. పెద్ద‌ల త‌ప్పిదాల‌ను ఈ ఫోటోషూట్ హైలైట్ చేసింది. ఇటీవ‌ల విచ్ఛ‌ల‌విడిత‌నంతో పెట్రేగిన సోష‌ల్ మీడియా ప్ర‌భావం కూడా ఈ జంట‌పై స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. హ‌ద్దులు చెరిపేసి రొమాన్స్ లో చెల‌రేగిపోయే ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. అయితే సోష‌ల్ మీడియాల్లో ఇలాంటి ఫోటోలు వీడియోలు చూడ‌టం ఇదే మొద‌టిసారి కాదు. రెగ్యుల‌ర్ గా ఇది అంద‌రికీ అల‌వాటైన వ్యాప‌క‌మే.

Tags:    

Similar News