దారుణం: న్యూయార్క్ లో బీమా సంస్థ సీఈవో హత్య

అగ్రరాజ్యంలో అతి పెద్ద మహానగరాల్లో ఒకటైన న్యూయార్క్ లో చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

Update: 2024-12-05 03:57 GMT

ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో అతి పెద్ద మహానగరాల్లో ఒకటైన న్యూయార్క్ లో చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. యూఎస్ లోని ప్రముఖ బీమా సంస్థగా పేరున్న యునైటెడ్ హెల్త్ కేర్ సీఈవో దారుణ హత్యకు గురయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.

మిడ్ టౌన్ లోని హిల్టన్ హోటల్ బయట ఈ కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం హోటల్ బయట కాపు కాసిన ఒక యువకుడు (ముసుగు ధరించి ఉన్నాడు) బీమా సంస్థ సీఈవో మీద కాల్పులు జరిపాడు. దీంతో.. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

ముఖానికి మాస్క్ తో వచ్చిన ఆ దుండగుడ్ని గుర్తించాల్సి ఉంది. సీఈవో బ్రియాన్ ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. హిల్టన్ హోటల్ లో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ డే కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. అనూహ్యంగా హత్యకు గురైన వైనం సంచలనంగా మారింది. హోటల్లో నిర్వహిస్తున్న సదస్సుకు హాజరయ్యేందుకే బ్రియాన్ అక్కడికి వచ్చినట్లుగా యునైటెడ్ హెల్త్ గ్రూప్ ముఖ్య అధికారి ఆండ్రూ విట్టీ వెల్లడించారు. ఈ ఉదంతంపై న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దుండగుడి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Tags:    

Similar News