యూపీలో మరో షాకింగ్ ఉదంతం.. కాఫీలో విషం కలిపి ఇచ్చిన భార్య

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వెలుగు చూస్తున్న ఉదంతాలు షాకింగ్ గా మారుతున్నాయి.;

Update: 2025-03-29 04:36 GMT
యూపీలో మరో షాకింగ్ ఉదంతం.. కాఫీలో  విషం కలిపి ఇచ్చిన భార్య

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వెలుగు చూస్తున్న ఉదంతాలు షాకింగ్ గా మారుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా.. భర్తలను టార్గెట్ చేస్తూ.. వారి ప్రాణాల్ని తీసే భార్యల సిరీస్ లో తాజాగా మరొకటి చేరింది. యూపీలోని ఫరూఖాబాద్ కు చెందిన 30 ఏళ్ల అనూజ్ శర్మపై విష ప్రయోగం జరిగింది. దీనికి కారణం అతడి భార్యే కావటం గమనార్హం.

విపరీతమైన వాంతులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భర్త వైద్యానికి ఆసుపత్రికి వెళితే.. భార్య మాత్రం ఎంచక్కా పుట్టింటికి వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో విషం కలిపిన కాఫీని భర్తకు ఇచ్చినట్లుగా పోలీసులకు ఫిర్యదు అందింది. రెండేళ్ల క్రితం అనూజ్.. పింకీల పెళ్లి జరిగింది. వివాహమైన రెండు నెలల నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో.. వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. వారు రంగంలోకి దిగి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో.. పదిహేను రోజుల క్రితం మళ్లీ భర్త వద్దకు వచ్చింది పింకీ. 28 ఏళ్ల పింకీ తరచూ ఒక అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని.. ఈ కారణంగానే భర్తతో పలుమార్లు గొడవ పడినట్లుగా అనూజ్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేరఠ్ లోని ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న అనూజ్ శర్మ గత మంగళవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు.

భార్యను కాఫీ అడిగాడు. పింకీ ఇచ్చిన కాఫీ తాగిన తర్వాత నుంచి వాంతులు అవుతుండటంతో అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మేరఠ్ కు తరలించారు. ఇంత జరుగుతున్నా.. పింకీ మాత్రం భర్త వెంట కాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు ఇచ్చిన కాఫీలో విష పదార్థాలుకలిపి ఇచ్చినట్లుగా అనూజ్ సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ షురూ చేశారు. అయితే.. అనూజ్ స్ప్రహలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఉదంతం మీద మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News