ముస్లింలకు బాబు బాసట : వక్ఫ్ బిల్లులో నెగ్గిన టీడీపీ పంతం
ఇక మరో వైపు చూస్తే కనుక వక్ఫ్ సవరణ చట్టంపై వైసీపీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సవరణ కానీ డిమాండ్ కానీ చేయకపోవడం మీద టీడీపీ ఫైర్ అవుతోంది.;

కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్ ముందుకు తీసుకుని రాబోతున్న వక్ఫ్ సవరణ బిల్లులో తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అనుకూలంగా ప్రతిపాదించిన మూడు సవరణలు నెగ్గాయని చెబుతున్నారు. మొత్తం నాలుగు సవరణలు టీడీపీ ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపాదిస్తే మూడింటిని ఆమోదించినట్లుగా చెబుతున్నారు. ఆ మూడు సవరణలూ ముస్లిం సమాజం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రతిపాదించినవే అని అంటున్నారు. వాటి విషయంలో పట్టుబట్టి మరీ తెలుగుదేశం తన పంతం కేంద్రం వద్ద నెరవేర్చుకుందని చెబుతున్నారు.
ఈ మూడు సవరణలు ఏమిటి అన్నది చూస్తే కనుక యూజర్ ద్వారా వక్ఫ్ అన్న దాని మీద పునరాలోచన వద్దు అన్నది. అంటే ఇప్పటికే వక్ఫ్ బై యూజర్ గా నమోదు చేయబడిన వక్ఫ్ ఆస్తుల కేసులు తిరిగి తెరవబడవన్న భరోసా అన్న మాట. అంతే కాదు వాటికి వక్ఫ్ డీడ్ లేకపోయినా వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి. ఇది ముస్లింలకు ఎంతో ఉపకరించే సవరణగా టీడీపీ చెబుతోంది.
ఇక రెండవది తీసుకుంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో కానీ ఇతరత్రా వ్యవహరాలలో కానీ కలెక్టర్ తుది అధికారం కాదు. అలా ఉండరాదు అన్నది కూడా టీడీపీ తెచ్చిన సవరణగా చెబుతున్నారు. దీని వల్ల కూడా ముస్లింలు ఎంతో ప్రయోజనం పొందుతారని అంటున్నారు.
ఇక మూడవది చూస్తే కనుక డిజిటల్‌గా పత్రాలను సమర్పించడానికి ఆరు నెలల గడువు పొడిగింపు. దీనిని కూడా టీడీపీ సవరణలకు పెట్టి సాధించింది. ఇది కూడా ఎంతో ముస్లిం మైనారిటీలకు ఎంతో ఊరటను ఇచ్చే అంశంగా చెబుతున్నారు. ఆ విధంగా టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలూ ఆమోదించబడ్డాయని చెబుతున్నారు.
ఇక నాలుగవ సవరణగా వ్క్ఫ్ ఆస్తులలో నాన్ ముస్లింల ప్రమేయం గురించి ఉంది. దీని మీద కూడా టీడీపీ పట్టుబడుతోంది. హిందూ దేవాలయాల విషయంలో వేరే మతస్థుల ప్రమేయాన్ని ఎలా అయితే ఒప్పుకోరో అదే విధంగా ముస్లింలు వాళ్ళ మత వ్యవహారాలలో ముస్లిమేతరుల యొక్క ప్రమేయాన్ని ఒప్పుకోరు అని గట్టిగా వాదిస్తోంది.
ఇకా చెప్పాలీ అంటే టీడీపీ మొదటి నుంచి దీని మీద గట్టిగా పోరాడుతోంది. ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాల్సి ఉందని చెబుతోంది. అయితే ఈ సవరణ మీద మాత్రం కొంత చేయాల్సి ఉందని అంటున్నారు. ఇలా కీలకమైన విషయాలలో తెలుగుదేశం పార్టీ ముస్లిం ల ప్రయోజనం కోసం పాటుపడుతూ పలు సవరణలకు కేంద్రం నుంచి ఆమోదం పొందింది. దాంతో వక్ఫ్ బిల్లు సవరణల వల్ల ముస్లింలకు పెద్దగా ఇబ్బంది లేకుండా చేసినట్లు అయింది అని అంటున్నారు.
ఇక మరో వైపు చూస్తే కనుక వక్ఫ్ సవరణ చట్టంపై వైసీపీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సవరణ కానీ డిమాండ్ కానీ చేయకపోవడం మీద టీడీపీ ఫైర్ అవుతోంది. వైసీపీకి నిబద్ధత చిత్తశుద్ధి ఉంటే కనుక ముస్లిం ల ప్రయోజనాల కోసం ఎందుకు పాటుపడని ప్రశ్నిస్తోంది. ఈ విధంగా ఉన్న వైసీపీ వైఖరిని ఆ పార్టీ రాజకీయ విధానాన్ని ముస్లిం సమాజం మొత్తం గమనించాలని కోరుతోంది. ఏది ఏమైనా బీజేపీకి ఎంతో కీలకమైన వక్ఫ్ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించి నెగ్గించుకోవడం అయితే చిన్న విషయం కాదనే అంటున్నారు. టీడీపీ ఈ విధంగా వ్యవహరించి ముస్లిం మైనారిటీ వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే కనుక దేశవ్యాప్తంగా అందరిలో ఉత్కంఠరేపుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతిస్తోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైన్ తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోసం పని చేస్తారని ఆయన గుర్తు చేశారు. బుధవారం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారని బిల్లు సభలో పెట్టిన తర్వాత దాని గురించి తాము మరిన్ని విషయాలు మాట్లాడతామన్నారు. చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటారన్నారు. ఈ విషయంలో రెండో మాట లేనే లేదని స్పష్టం చేశారు.