ఇండియా విషయం పక్కన పెట్టండి ...ట్రంప్ దెబ్బకి అమెరికా లో కూడా ఐఫోన్ కొనాలంటే బొమ్మ కనిపిస్తదట!

ఇంతకాలం అమెరికా నుంచి తెలిసినోళ్లు వస్తున్నాంటే.. ఒక ఐఫోన్ కానీ.. ఐప్యాడ్ కానీ కొనుక్కురమ్మని అడిగేవాళ్లం కదా.;

Update: 2025-04-05 15:30 GMT
iPhone Prices May Soar in U.S. Due to Trump’s Tariffs

ఇంతకాలం అమెరికా నుంచి తెలిసినోళ్లు వస్తున్నాంటే.. ఒక ఐఫోన్ కానీ.. ఐప్యాడ్ కానీ కొనుక్కురమ్మని అడిగేవాళ్లం కదా. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ తెర మీదకు రానుందా? ఇప్పటివరకు అమెరికాలో కారుచౌకగా ఉండే (భారత్ ధరలతో పోలిస్తే) ఐఫోన్ ధరలకు రెక్కలు రానున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి మరెవరో కారణం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకుంటున్న ఎడాపెడా నిర్ణయాలు చివరకు అమెరికన్లకే పెద్ద దెబ్బగా మారతాయన్న మాట వినిపిస్తోంది.

అమెరికాను మరింత సంపన్న దేశంగా మారుస్తానని చెబుతూ.. ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాన్ని విధిస్తున్న తీరు.. చివరకు అమెరికన్లకే గుదిబండగా మారుతుందా? అంటే.. అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లలో అత్యధికం చైనా లేదంటే వియత్నాం.. కాదంటే భారత్ లో ఉత్పత్తి అవుతున్నవే.

తాజాగా పెంచిన సుంకాల కారణంగా ఐఫోన్ ధరలకు రెక్కలు రావటం ఖాయమంటున్నారు. ప్రస్తుతం చైనా మీద ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో 54 శాతానికి చేరుకుంది. అలా అని ఉత్పత్తిని చైనా నుంచి వియత్నాంకు లేదంటే బారత్ కు మార్చారనే అనుకుందాం. ఆ దేశాల్లోనూ 26చ 46 చొప్పున సుంకాల్ని విధిస్తామని ట్రంప్ స్పష్టం చేయటం తెలిసిందే. ఈ ధరా భారం యాపిల్ సంస్థ మీద భారీగా పడనుంది. దీంతో.. ఈ దిగ్గజ సంస్థ ముందు ఉన్న మార్గాలు రెండు మాత్రమే.

ఒకటి.. యాపిల్ మీద పడే అదనపు భారాన్ని ఆ కంపెనీనే భరించటం. రెండోది.. ఫోన్ కొనే వినియోగదారుడి మీద వేయటం. అలా చేస్తే.. ఐఫోన్ అమ్మకాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సుంకాల్ని వినియోగదారుడికే నేరుగా వేద్దామన్నా.. ఐపోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒక్కో ఐఫోన్ మీద 30 నుంచి 43 శాతం మేర పెరుగుతాయని అంచనా. ఉదాహరణకు ప్రస్తుతం అమెరికాలో ఐఫోన్ 16 ధర 799 డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. రూ.68,339. తాజా సుంకాలు వినియోగదారుడి మీదనే వేస్తే.. దాని ధర ఏకంగా 1142 డాలర్లకు చేరుకుంటుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే.. రూ.97,676. అంటే ఒక్క ఫోన్ మీద వచ్చే వ్యత్యాసం. దగ్గర దగ్గర రూ.30వేలు. అదే ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ అయితే 1599 డాలర్లు కాస్తా 2300 డాలర్లకు చేరుకుంది. ఒక్కో ఫోన్ మీద వచ్చే తేడా 700 డాలర్ల అంటే.. సుమారు రూ.60వేలు. ఇంత భారం మీద పడినప్పుడు.. అందుకు కారణమైన ట్రంప్ విషయంలో అమెరికన్లు ఎలా రియాక్టు అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా? 

Tags:    

Similar News