ముందస్తు ప్రిపరేషన్ లో బాబు ఉన్నారా ?

చంద్రబాబు అయితే 2029లో జమిలి అంటున్నారు. ఏపీలో గత రెండున్నర దశాబ్దాలుగా జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి.

Update: 2024-12-14 23:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి పాలన ఆరు నెలలు అక్షరాలా పూర్తి అయింది. ఇంకా చేతిలో నాలుగున్నరేళ్ల పాలన ఉంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే 2029 లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అలా ఆలోచిస్తే కూటమి ప్రభుత్వ సారధి చంద్రబాబుకు కావాల్సినంత టైం ఉంది.

అదే జమిలి ఎన్నికలు అంటే ముందే తోసుకుని వస్తాయి. ఈ శీతాకాల సమావేశాలలో జమిలి బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకునే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.దానిని మరింత స్పీడ్ గా పరిగెత్తించి 2027 మొదట్లో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రంలో లోక్ సభకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అన్న మాట. సాధారణంగా ఈ తరహా ఎన్నికల వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా లబ్ది కలుగుతుంది. వారు తమకు అనుకూలమైన టైం చూసుకుని ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటారు.

అయితే జమిలి ఎన్నికలు దేశంలోని అన్ని పార్టీలకు ఇష్టమేనా అంటే బయటకు చెప్పకపోయినా విపక్షాలకు ఇష్టమే అవుతుంది. ఎందుకంటే సహజంగా వారు మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తారు. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే తమకు మరో చాన్స్ వస్తుందని కూడా భావిస్తారు.

అలా చూస్తే కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి కూడా జమిలి ఎన్నికలు వస్తే తమకు ముందే కేంద్రంలో అధికార పీఠం దక్కుతుందని ఆశలు ఉండవచ్చు అని అంటున్నారు. ఇక అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రం జమిలి అంటూ ముందుగా ఎన్నికలు వస్తే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా భారీ మెజారిటీలతో గెలిచిన పార్టీలకు అది మరింత ఇబ్బంది అవుతుంది.

ఈ లెక్కన చూస్తే ఏపీలోని టీడీపీ ఎన్డీయే ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నా జమిలి ఎన్నీకల విషయంలో సగం మద్దతు మాత్రమే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. జమిలికి ఓకే అంటూనే అవి 2029లోనే వస్తాయని పదే పదే చంద్రబాబు అంటున్నారు. అంటే అయిదేళ్ళూ పూర్తిగా అధికారంలో తాము ఏపీలో ఉండాలని ఆయన భావిస్తున్నారు అని తెలుస్తోంది.

అయితే బీజేపీ జమిలి ఎన్నికలు అన్న కాన్సెప్ట్ తెచ్చిందే షెడ్యూల్ ప్రకారం జరిగే 2029 ఎన్నికలను కనీసంగా ఒక ఏణ్ణర్ధం అయినా ముందుకు జరపడానికి అని అంటున్నారు. ఎందుకంటే ఇపుడు ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి. దేశంలో బీహార్ యూపీలలో చూస్తే మొత్తం 120 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి.

ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వరసగా 2025, 2026లలో ఉన్నాయి. అలా ఎన్నికలు జరిగి బీహార్ లో ఆర్జేడీ యూపీలో అఖిలేష్ యాదవ్ ఎస్పీ అధికారంలోకి వస్తే కనుక బీజేపీకి 2029లో అధికారానికి గండి పడినట్లే. అందుకే వాటిని తెచ్చి జమిలిలో కలిపి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళి మొత్తంగా గెలవాలన్నది బీజేపీ ప్లాన్ అని అంటున్నారు.

చంద్రబాబు అయితే 2029లో జమిలి అంటున్నారు. ఏపీలో గత రెండున్నర దశాబ్దాలుగా జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి. అందువల్ల అదేమీ కొత్త కాదు కానీ ముందుగా ఎన్నికలు అంటే ఎందుకో బాబుకు ఇష్టం లేదని అంటున్నారు. ఆయన అనుకున్న పోలవరం అమరావతి ఒక రూపునకూ షేపునకూ రావాలీ అంటే 2029 దాకా టైం ఉండాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు.

అంతే కాదు మధ్యలో ఎన్నికలకు వెళ్తే ఏమో ప్రజల మూడ్ ఎపుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు అన్నది కూడా బాబు వంటి రాజకీయ చాణక్యుడికి తెలియనిది కాదు అని అంటున్నారు. అంత రిస్క్ ఎందుకు చేసుకోవాలన్నది కూడా ఆయనకు ఉంది అని అంటున్నారు. నిజంగా 2027 ఎన్నికలు అంటే ఎంత స్పీడుగా ఉన్నా ఏపీలో టీడీపీ కానీ బాబు కానీ పూర్తిగా ప్రిపరేషన్ లోకి రాలేరని అంటున్నారు.

అందుకే ఆయన 2029లో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీదే కీలక డెసిషన్ కాబట్టి బీజేపీ ఎలా తలచుకుంటే అలా అవుతుంది అంతిమంగా ముందస్తు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఏపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బాబు 2029 ఎన్నికలు అంటూ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే ముందస్తు అంటే కూటమికి ఇష్టం లేదా అన్నది కూడా మరో చర్చకు దారి తీస్తోంది.

Tags:    

Similar News