గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారు లేఖ రాస్తాం: జగన్
అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసం గించిన గవర్నర్ నజీర్‌తో.. అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పించారని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తాము అబద్ధాలు చెప్పడమే కాకుండా.. గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసం గించిన గవర్నర్ నజీర్‌తో.. అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పించారని అన్నారు. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నేతలు.. గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి.. రూ.10 లక్షల కోట్ల లోపు అప్పులు ఉన్నాయని చెప్పించారని తెలిపారు.
అయితే.. ఆర్థిక సర్వే, ఆర్బీఐ నివేదికలు, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల అప్పుల ప్రస్తావన, కేంద్రం ఏటా ఇచ్చిన ఆర్థిక నివేదికలు, కాగ్ లెక్కలు వంటివాటినిగమనిస్తే.. రాష్ట్రంలో ఉన్న అప్పు 4.27 లక్షల కోట్లేనని.. కార్పొరేషన్లు, విద్యుత్ డిస్కమ్‌లు సహా అన్ని రూపాల్లోనూ చేసిన అప్పులు చూస్తే.. 7.2 లక్షల కోట్లేనని కాగ్ చెప్పిందని.. ఈ విషయాలను, ఈ వాస్తవాలను చంద్రబాబు దాచి పెట్టారని.. మరి ఈ నిజాలను గవర్నర్ కూడా పరిశీలించకుండానే వారు ఇచ్చింది చదివారని అన్నారు.
ఈ నేపథ్యంలో గవర్నర్‌తోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పించిన విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆయనకు శుక్రవారమే లేఖ రాయనున్నట్టు తెలిపారు. అబద్ధాలు చెప్పించిన చంద్రబాబుపైనా.. చంద్రబాబు ప్రబుత్వంపై చర్యలు తీసుకునేలా.. చీవాట్లు పెట్టేలా కోరతామని జగన్ తెలిపారు. రాజకీయంగా అబద్దాలు చెప్పడమే కాకుండా.. నిండు సభలో గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పిం చారని.. వీటిని తాము గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించి.. చర్యలు తీసుకునేలా పట్టుబడతామని జగన్ వివరించారు.