జగన్ హామీ ఇచ్చారు.... క్షణాల్లో పరిష్కారం....!
జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆర్తులు ఇబ్బందులలో ఉన్న వారూ ఆయన కోసం ఎదురుచూస్తూంటారు.
జగన్ విశ్వసనీయతకు మారు పేరు అని అందుకే అంటారు. ఆయన మాట ఇచ్చారు అంటే చేసి చూపిస్తారు. ఆ క్రెడిబిలిటీయే ఆయనను రాజకీయల్లో బలోపేతం చేస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆర్తులు ఇబ్బందులలో ఉన్న వారూ ఆయన కోసం ఎదురుచూస్తూంటారు.
సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చి ఆయనకు అభ్యర్ధన పెట్టుకోవడానికి కూడా కుదరని వారు జగన్ జిల్లా పర్యటనలో కనిపిస్తూంటారు. వారు సీఎం తమ వద్దకే వస్తూంటే తమ బాధలు చెప్పుకుని సాయం కోసం అర్ధిస్తారు. ఇలా వచ్చిన వారిని ఎవరినీ నిరాశకు గురి చేయకుండా జగన్ హామీ ఇస్తారు. ఆపన్న హస్తంతో క్షణాలలో అదుకుంటారు. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెనో ఉన్నాయి. అలాంటిదే తాజాగా భీమవరంలో జగన్ టూర్ లో కూడా జరిగింది.
జగన్ భీమవరం టూర్ లో ఆయనను చాలా మంది సాయం కోసం కలిశారు. అలా కలసిన వారి సమస్యలు జగనన్న హామీ గంటలో పరిష్కారం చూపించింది. దాంతో శభాష్ జగన్ అని బాధితులతో పాటు జనాలు కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే భీమవరం పర్యటనలో తొమ్మిది మంది అర్జి దారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కుల పంపిణీ జరిగింది. ఈ చెక్కులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అందచేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన సందర్భంగా పలువురి సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
దాంతో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో తొమ్మిది మంది అర్జి దారులకు లక్ష రూపాయలు వంతున చెక్కులను కలెక్టర్ అందజేశారు. అంతే కాదు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు.
ఇక ఈ విధంగా చెక్కులు అందుకున్న వారి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్ బి చర్ల గ్రామానికి చెందిన కడలి నాగలక్ష్మికి భూ పరిష్కారంలో భాగంగా పరిహారం అందజేశారు. అలగే నర్సాపురం మండలం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణకు భర్త చనిపోయారని ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం బోడ్డి పట్ల గ్రామానికి చెందిన చిల్లి సుమతి తన బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకిందని ముఖ్యమంత్రిని ఆర్థిక సహాయం చేయమని కోరితే వెంటనే ఆమెకు ఈ సాయం లభించింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కంతేటి దుర్గ భవానికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి ఆర్ధిక సాయం అందించారు.
ఇక అదే ఏలూరు జిల్లాలోని ఏలూరుకి చెందిన తేతలి గీతకు భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం కోరితే ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఆర్ధిక సాయం చేశరు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ళ గ్రామానికి చెందిన అరుగుల లాజరస్ తన కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రిని అర్ధిస్తే ఆయనకూ సాయం ఆర్ధికంగా దక్కింది.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలోని గుడాల అపర్ణ జ్యోతికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ ఆర్ధిక సాయం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానపల్లి గ్రామానికి చెందిన కోరాడ వీర వెంకట సత్యనారాయణకు వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ తక్షణం స్పందించి ఆర్ధిక సాయం అందించారు. మొత్తంగా జగన్ రాక వల్ల తొమ్మిది కుటుంబాల్లో వెలుగులు ప్రసరించాయి. అది కూడా ఉత్త హామీ కాదు తక్షణమే సాయం చేతులలో పడడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.