జియోస్టార్ తో ఆ రెండు ఓటీటీల లెక్క మారుబోతుందా?
తాజా నివేదికల ప్రకారం కొత్త విలీన ప్లాట్‌ఫారమ్‌ను జియో స్టార్ గా పిలుస్తున్నారు.
రిలయన్స్ వయాకామ్ లో డిస్నీ స్టార్ ఇండియా విలీనం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభమైంది. ఇటీవలే మరోసారి విలీన ప్రక్రియ విషయాన్ని కార్పోరేట్ దిగ్గజాలు అధికారింగానూ మరోసారి కన్పమ్ చేసాయి. ఈ నవంబర్ 14 కల్లా విలీన ప్రక్రియ పూర్తిగా పూర్తవుతుంది. అటుపై రిలయన్స్, డిస్నీ కలిసి జియో స్టార్ గా అవతరిస్తాయి. దానికి సంబంధించి ఓటీటీ స్పేస్ లో ఇంటర్ ఫేస్ కూడా సిద్దమవుతోంది.
జియో సినిమా హాట్‌స్టార్‌లో మెరుగైన వినియోగదారు ఇంటర్‌ఫేస్ , సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుం దని ఇటీవల జీయో పేర్కొంది. తాజా నివేదికల ప్రకారం కొత్త విలీన ప్లాట్‌ఫారమ్‌ను జియో స్టార్ గా పిలుస్తున్నారు. నవంబర్ 13న విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత 14 నుంచి జియో స్టార్ లైవ్ లోకి వస్తుంది. వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారం అయిన తర్వాత, హాట్‌స్టార్ మరియు జియో సినిమా కంటెంట్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుంది.
దీంతో నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తర్వాత ఓటీటీ స్పేస్ లో జియో స్టార్ మూడవ పెద్ద ప్లేయర్ గా మారుతుంది. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి ప్రైమ్ వీడియో నెట్‌ఫ్లిక్స్ మాత్రమే పోటీ పడ్డాయి. ఈ రెండింటి మధ్యనే ఎక్కువగా పోటీ కనిపించేది. మార్కెట్ లో ఇంకా చాలా ఓటీటీలున్నా? ఈ రెండింటితో పోటీ పడే శక్తి వాటికి లేకపోవడంతో కంటెంట్ ని ఈ రెండు సంస్థల్లో ఏదో ఒకటి దక్కించుకునేది.
కానీ ఇప్పుడా లెక్క మారుతుంది. జియో స్టార్ ఎంట్రీతో త్రిముఖ పోటీ తప్పదు. నెట్ ప్లిక్స్, అమెజాన్ తో పాటు జియో స్టార్ రింగులోకి దిగిందంటే? కంటెంట్ దక్కించుకునే వరకూ వెనక్కి తగ్గే టైపు కాదు. బిజినెస్ స్ట్రాటజీ విషయంలో జియో లెక్క వేరేలా ఉంటుంది. జియో కంటెంట్ కి భారీ ఎత్తున సబ్ స్క్రిప్షన్ పెంచుకునే చర్యలకు దిగుతుంది.