అసెంబ్లీలో భజనలు.. రాత్రి అక్కడే నిద్రపోయిన ఎమ్మెల్యేలు!

అవును... మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ లో భూములు కోల్పోయిన వారికి స్థాలాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వేశారు బీజేపీ నేతలు.

Update: 2024-07-25 05:58 GMT

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీని మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) స్కామ్మ్ కుదిపేస్తోంది. ఈ మేరకు ఉభయసభల్లోనూ ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది బీజేపీ. కానీ... విపక్షాలను అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ అనుమతించలేదు. దీంతో... సభ్యులు విధానసభలోనే ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో రాత్రంతా సందడి నెలకొంది!

 

అవును... మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ లో భూములు కోల్పోయిన వారికి స్థాలాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వేశారు బీజేపీ నేతలు. ఈ వ్యవహారంలో సుమారు 4 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపణలు చేశారు. ఇందులో స్వయంగా సీఎం సిద్ధరామయ్య భార్యకు అప్పనంగా భూములు కట్టబెట్టారనేది వారి మండిపాటు.

 

ఈ నేపథ్యంలో... ఉభయ సభల్లోనూ ఈ వ్యవహరంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబట్టడంతో ఏర్పడిన గందరగోళం మధ్యే ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇదే సమయంలో... సిద్దరామయ్య భార్యకు స్థలాలను చట్టబద్ధంగానే ఇచ్చినట్లు నిరూపించాలని బీజేపీ పక్షనేత అశోక్ డిమాండ్ చేశారు. దీనిపై క్లారిటీ ఇవ్వకపోతే పగలూ రాత్రి అసెంబ్లీలో ధర్నాకు కూర్చుంటామని తెలిపారు.

 

దీంతో... చెప్పినట్లుగానే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా... ప్రతిపక్ష నాయకులు బుధవారం రాత్రంతా అసెంబ్లీ నిద్రపోయారు. విపక్ష నేత అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయేంద్ర సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే నిద్రపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ముందుగా అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ కు వ్యతిరేకంగా భజన చేస్తూ, ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేసిన విపక్ష ఎమ్మెల్యేలు... రాత్రి పూట కూడా తమ నిరసన కొనసాగించారు. ఇందులో భాగంగా... రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రకు ఉపక్రమించారు! ఈ విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!

Tags:    

Similar News