పక్క రాష్ట్ర అధికారులను మా రాష్ట్రం లోనికి రానివ్వం!

మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అల్టిమెటం జారీచేశారు

Update: 2024-01-18 05:53 GMT

మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అల్టిమెటం జారీచేశారు. ఈ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తమ ప్రభుత్వ అధికారులకు సూచించారు. దీంతో ఆరుదశాబ్ధాల నాటి సమస్య మరోసారి తెరపైకి వచ్చినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అవుతుంది.

అవును... మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు కర్ణాటకలో అడుగుపెట్టొద్దని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దీనికి కారణం... సుమారు ఆరు దశాబ్ధాలుగా ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం. ఈ సమయంలో మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం కింద చేపట్టిన కార్యక్రమాన్ని కర్ణాటకలో ఉండే కొంతమంది ప్రజలకు అమలు చేయాలని భావించింది.

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని 865 గ్రామాలలో మరాఠా మాట్లాడే ప్రజలు నివసిస్తుంటారు. అయితే... వీరిని కవర్ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం అమలుచేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర అధికారులు కర్ణాటకలో అడుగుపెట్టకూడదని తెలిపింది.

వాస్తవానికి 2022 డిసెంబర్ లో అప్పటి బీజేపీ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం... "మహారాష్ట్రకు ఒక అంగుళం భూమిని ఇవ్వకూడదు". ఇదే సమయంలో... బెల్గాం, కార్వార్ వంటి పట్టణాలతో పాటు తాను కెల్యిం చేస్తున్న 865 గ్రామాలలో ప్రతి అంగుళం తమదేనంటూ మహారాష్ట్ర శాసనసభ వెల్లడించింది! ఈ విషయంలో దావా ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌ లో ఉంది.

ఈ నేపథ్యంలో మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో మరాఠా మాట్లాడే 865 గ్రామలలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం అమలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తున్న నేపథ్యంలో... కర్ణాటక సీఎం సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా వారిని రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో... బెలగావి సమస్య మరోసారి తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News