జగన్, లోకేష్‌పై బీఆర్ఎస్ నేత కీలక కామెంట్స్!

అయితే.. వైఎస్ ఫ్యామిలీ పట్ల విధేయతతో ఉండాల్సిన సబితా ఫ్యామిలీ జగన్ పట్ల కాస్త తక్కువ గౌరవం చూపిస్తున్నట్లుగా అర్థం అవుతోంది.

Update: 2024-11-22 09:30 GMT

తెలంగాణలోని మహిళా నేత సబితా ఇంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె రెండు పర్యాయాలు హోంమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత బీఆర్ఎస్ హయాంలోనూ మంత్రిగా కొనసాగారు. ఆమె వారసత్వంతో ఆమె కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సబితాకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆమె కూడా వైఎస్సార్‌కు అత్యంత విధేయురాలుగానూ కొనసాగారు. టీడీపీ నాయకుడిగా కొనసాగిన ఆమె భర్త ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ హయాంలో చాలా యాక్టివ్ లీడర్‌గా ఉన్నారు. దాంతో వైఎస్సార్ కూడా ఆమె ప్రాధాన్యతను తగ్గించకుండా హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మహిళకు హోంమంత్రి పదవి అప్పగించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. వైఎస్సార్ హయాంలో అంతలా కీలక పదవులు చేపట్టిన సబితా సాధారణంగా వైఎస్ కుటుంబానికి శ్రేయోభిలాషిగా ఉంటారని అందరం అనుకుంటాం. ఆమె కూడా తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన వైఎస్ కుటుంబానికి విధేయతతో ఉంటారని ఎవరైనా అనుకుంటారు. వైఎస్సార్ కుటుంబానికి ఈ కుటుంబం శ్రేయోభిలాషిగా ఉండాలని ఆశించడం తప్పితే.. పరిస్థితి మాత్రం అంతకు భిన్నంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఏపీలో ఆయన రాజకీయంగా పోరాడుతూనే ఉన్నారు. ఓ ఐదేళ్లు ప్రతిపక్షంలో కొనసాగారు. ఆ తరువాత ప్రజలకు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

అయితే.. వైఎస్ ఫ్యామిలీ పట్ల విధేయతతో ఉండాల్సిన సబితా ఫ్యామిలీ జగన్ పట్ల కాస్త తక్కువ గౌరవం చూపిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. యాదృచ్ఛికంగా సబితా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. జగన్‌ గురించి ప్రశ్న వేసినప్పుడు. జగన్ కేవలం వైఎస్సార్ కుమారుడే అన్న చందంగా వ్యాఖ్యలు చేశారు. షర్మిల విషయంలోనూ అలాగే మాట్లాడారు. వైఎస్ ఫ్యామిలీ పట్ల విధేయతను ఏమాత్రం ప్రదర్శించలేదు. అయితే.. అదే సందర్భంలో నారా లోకేష్ గురించి వేసిన ప్రశ్నకు మాత్రం డిఫరెంటుగా సమాధానం ఇచ్చారు. అతను భవిష్యత్తు కోసం ప్రకాశవంతమైన నాయకుడు అని బదులిచ్చారు. ఎవరైనా జగన్ పట్ల కార్తీక్ రెడ్డి గొప్పగా మాట్లాడి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ.. కేవలం అతన్ని వైఎస్ కుమారుడిగానే సంభోదించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి వల్లే కార్తీక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా.. అన్న టాక్ వినిపిస్తున్నది.

Tags:    

Similar News