ఎఫ్.బీ.ఐ చీఫ్ కు బాలీవుడ్ స్టైల్లో విషెస్... నెట్టింట మామూలు రచ్చ కాదు!

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా ఎంపికైన కశ్యప్ పటేల్ కు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ప్రెసిడెంట్ ట్రంప్ అసిస్టెంట్ అయిన డాన్ స్కావినో బాలీవుడ్ స్టైల్లో విషెస్ చెప్పారు.

Update: 2025-02-21 19:30 GMT

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) దైరెక్టర్ గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ నియామకాన్ని సెనెట్ 51-49 ఓట్లతో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అధ్యక్షుడు ట్రంప్ సహాయకుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో.. కాష్ పటేల్ కు బాలీవుడ్ స్టైల్ లో పలికిన స్వాగతం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా ఎంపికైన కశ్యప్ పటేల్ కు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ప్రెసిడెంట్ ట్రంప్ అసిస్టెంట్ అయిన డాన్ స్కావినో బాలీవుడ్ స్టైల్లో విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా... "ఎఫ్.బి.ఐ. కొత్త డైరెక్టర్ కాష్ పటేల్ కు అభినందనలు" అని పేర్కొంటూ.. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలోని మల్హరీ సాంగ్ ను పోస్ట్ చేశారు.

ఈ సాంగ్ లోని రణవీర్ సింగ్ ముఖాన్ని కాష్ పటేల్ తో మాషప్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. 47 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకూ సుమారు 5.3 మిలియన్స్ వ్యూస్ రాగా... 134కే లైక్స్ వచ్చాయి. కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు గరిష్టంగా కాష్ పటేల్ ను అభినందిస్తూ.. ఈ వీడియో ఆలోచనపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోపక్క ఎఫ్.బీ.ఐ. తొమ్మిదో డైరెక్టర్ గా తనను నియమించడంపై కాష్ పటేల్ స్పందించారు. ఈ నియామకం తనకెంతో గౌరవంగా ఉందని చెబుతూ.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. ఎంతో ఘన చరిత్ర ఉన్న బ్యూరో.. దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.

ఇదే సమయంలో... అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే.. వారి అంతు చూస్తానని రాసుకొచ్చారు. మరోపక్క.. ఎఫ్.బీ.ఐ. డైరెక్టర్ గా కాష్ పటేల్ ఎంపిక కావడంతో.. ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్ గా ఆయన రికార్డ్ సృష్టించారు!

Tags:    

Similar News