టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వనున్న కేశినేని నాని....?
దీనికి ఆయన తాజాగా ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఎక్కడా కూడా టీడీపీ అన్న పేరు లేకపోవడం విశేషం.
విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వనున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. కేశినేని నాని నారా లోకేష్ పాదయాత్ర విజయవాడలో జరిగినా కూడా కనీసం తొంగి చూడలేదు, వంగివాలలేదు. ఇది చాలదా ఆయన పార్టీకి దూరంగా జరుగుతున్నారు అని అనడానికి అంటున్నారు.
నారా లోకేష్ ఈ రోజు టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి వారు ఆయన మొత్తం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యతను లోకేష్ తన భుజాల మీద వేసుకున్నారు. అలాంటి లోకేష్ తన పార్లమెంట్ పరిధిలోకి పాదయాత్రకు వస్తే సొంత పార్టీ ఎంపీ డుమ్మా కొట్టడం అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఆ సంగతి అలా ఉండగానే కేశినేని నాని చేసిన మరో పనితో ఆయన ఏకంగా పార్టీకి గుడ్ బై కొడతారు అని ఒక రేంజిలో డౌట్ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పధకం అయిన స్పూర్తి పథకం కోసం ఎంపీ తన ఎంపీలాడ్స్ నిధులతో కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రంతో పాటు విక్రయ భవన సముదాయం నిర్మించారు.
దీనికి ఆయన తాజాగా ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఎక్కడా కూడా టీడీపీ అన్న పేరు లేకపోవడం విశేషం. అలా పార్టీ పేరు లేకుండా నాని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అని అంటున్నారు. దాంతో ఈ రూపేణా కేశినేని నాని టీడీపీకి ఇచ్చిన సందేశం సంకేతం ఏంటి అంటే తాను టీడీపీకి దూరం అనే అంటున్నారు.
నానికి ఈ రేంజిలో కోపం రావడానికి కారణం ఆయన సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ బాగా ప్రోత్సహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ని కేశినేని చిన్నిని ఇవ్వడానికి టీడీపీ అధినాయకత్వం దాదాపుగా డిసైడ్ అయిపోయింది. ఇక కేశినేని చిన్ని టోటల్ గా మొత్తం లోకేష్ పాదయాత్రను క్రిష్ణా జిల్లావ్యాప్తంగా చూసుకున్నారు.
అదే విధంగా టీడీపీలో నాని వ్యతిరేక నాయకులు అంతా చిన్ని తో సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూసిన కేశినేని నాని ఇక పార్టీలో ఉండడం దండుగ అని డిసైడ్ అయ్యారా అన్నదే చర్చకు వస్తోంది. తన కుటుంబంలో చిచ్చు పెట్టి అన్నదమ్ములను రాజకీయంగా విడదీయాలని చూస్తే తాను సహించను అంటూ నాని గతంలో హై కమాండ్ కే హెచ్చరికలు పంపించారు.
కానీ ఆయన కోరుకోనిదే జరుగుతోంది. దీంతో కేశినేని నాని పూర్తిగా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఇక సరైన ముహూర్తం చూసుకుని కేశినేని నాని టీడీపీకి గుడ్ బై కొట్టడమే మిగిలింది అని అంటున్నారు. నాని గుడ్ బై కొడితే అది టీడీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.