డేటింగ్ యాప్ లో మాయగాడు... హైదరాబాద్ లో అమ్మాయిలకు షాకింగ్ స్కెచ్!
వివరాళ్లోకి వెళ్తే... కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పలు డేటింగ్ యాప్ లను కేంద్రంగా చేసుకొని, పలువురి యువతులను మోసం చేశాడు.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న మోసాలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా.. ఆ మోసాల పట్ల ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. మాయగాళ్లు సరికొత్త స్కెచ్చులు వేస్తూనే ఉన్నారు.. బాధితులు సరికొత్తగా మోసపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలకు వేసిన స్కెచ్ వ్యవహారం ఇప్పుడు సైబరాబాద్ స్టే షన్ కు చేరింది!
అవును... తనను తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.. ఆ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.. ఇతగాడి పెర్ఫార్మెన్స్ పీక్స్ కి చేరుతుంది.. దీంతో... కరిగిపోయిన అమ్మాయిలు లక్షలు సమర్పించేసుకుంటారు. ఆనాక విషయం తెలుసుకుని లబో దిబో మంటారంట!
వివరాళ్లోకి వెళ్తే... కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పలు డేటింగ్ యాప్ లను కేంద్రంగా చేసుకొని, పలువురి యువతులను మోసం చేశాడు. పలు డేటింగ్ యాప్ లలో తాను ఓ గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ సమయంలో కొంతమంది యువతులను టార్గెట్ చేసి వారి ప్రొఫైల్ పై ఇంట్రస్ట్ చూపిస్తాడు.
ఇతడు గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడంతో పలువురు అమ్మాయిలు ఇతడి ప్రొఫైల్ ను లైక్ చేశారు. అలా లైక్ చేసిన వారితో చాటింగ్ మొదలుపెట్టి, అనంతరం మొబైల్ నెంబర్స్ షేర్ చేసుకుని టచ్ లోకి వెళ్లి మాటలు కలుపుతాడు. అనంతరం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఎవరైనా యువతులు కలుద్దామని చెప్పగానే... కచ్చితంగా కలుద్దామని నమ్మిస్తాడు.
తీరా సదరు అమ్మాయిలు కలవడానికి ప్రిపేర్ అయ్యే సమయానికి... తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఫ్యామిలీ ప్రాబ్లం అని ఏవో కుంటి సాకులు చెప్పి... దాన్ని ఆర్థిక సమస్యగా చిత్రీకరిస్తాడు. అనంతరం సదరు యువతులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తుంటాడు. తీరా అది ఫేక్ అని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు!
ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ క్రైం పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. ఈ క్రమంలో అతడు కీలక విషయాలు వెల్లడించాడని అంటున్నారు. అమ్మాయిల నుంచి తీసుకున్న డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నడని.. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుంటాడని చెబుతున్నారు.