వందేళ్ల వయసులో లవ్.. పెళ్లి.. నిజం!
అయితే.. వీటికి భిన్నంగా అమెరికాలో ఒక కొత్త సంఘటన తెరమీదికి వచ్చింది. కాటికి కాళ్లు చాపుకొన్న వయసులో ఓ జంట ప్రేమలో పడింది.
సాధారణంగా ప్రేమించుకునేందుకు ఒక వయసు ఉంటుంది. టీనేజ్‌లోనే సాధారణంగా యువతీ యువ కులు ప్రేమలో పడతారు. వివాహ బంధంతో ఒక్కటయ్యేవారు ఎక్కువ మందే ఉన్నా.. వివిధ కారణాలతో విడిపోయే వారు కూడా అంతే మొత్తంలో ఉన్నారు. సరే.. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తుల మనసులు కూడా మారుతున్నాయి. ప్రేమలకు ఈ వయసు.. ఆ వయసు అనే సంబంధం లేదు. పెళ్లయి.. పిల్లలు ఉన్నవారు కూడా.. ఇతర వ్యక్తులను ప్రేమించి.. విడిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
అయితే.. వీటికి భిన్నంగా అమెరికాలో ఒక కొత్త సంఘటన తెరమీదికి వచ్చింది. కాటికి కాళ్లు చాపుకొన్న వయసులో ఓ జంట ప్రేమలో పడింది. వారి వయసు 60-70 కాదు..ఏకంగా 100 ఏళ్లు దాటేశారు. అయినా.. ఇరువురు ఆరోగ్యంగా ఉండడంతోపాటు.. ఉత్సాహంగానూ ఉన్నారు. దీంతో తొలి చూపులోనే ప్రేమపడ్డా రట. ఇప్పుడు వారి వివాహానికి ఇరు కుటుంబాల్లోని పిల్లలు.. మునిమనవలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా.. ఈ వృద్ధ జంట ఒక్కటైంది.
ఎవరు... ఎక్కడ?
వధువు వయసు 102 ఏళ్లు. నిజ్జంగా నిజం. ఇక, వరుడి వయసు 100సంవత్సరాలు. ఇటీవలే ఇరువురు కూడా పుట్టిన రోజులు జరుపుకొన్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లిగా రికార్డు సృష్టించడం మరో విశేషం. 102 ఏళ్ల వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్ ఇద్దరూ కొన్నాళ్ల కిందట ఎదురు పడ్డారు. వారి మధ్య అనూహ్యంగా ప్రేమ చిగురించింది. దీంతో ఇంట్లో వారిని ఒప్పించి మరీ ఒక్కటి కావడం మరో ట్విస్టు. ఈ విషయం బయటకు పొక్కగానే.. ప్రపంచ వ్యాప్తంగా పెద్దన గ్రీటింగ్స్ కురుస్తుండడంమరో విశేషం.