విజయసాయిరెడ్డి డీ.ఎన్.ఏ టెస్ట్‌‌ కు రావాల్సిందే!

అవును... తన భార్య శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సుభాష్ లపై అసిస్టెంట్ ప్రొఫెసర్, దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-07-15 14:44 GMT

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి.. విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శాంతి తో పాటు నేడు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో శాంతి భర్త మదన్ మోహన్ మరోసారి సంచలన ఆరోపణలు, డిమాండ్ చేశారు.

అవును... తన భార్య శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సుభాష్ లపై అసిస్టెంట్ ప్రొఫెసర్, దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో.. విజయసాయిరెడ్డి డీ.ఎన్.ఏ టెస్ట్‌‌ కు రావాల్సిందేనని అన్నారు. ఈ సమయంలో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డినేనని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని.. అందుకు కారణం ఎవరనేది తనకు తెలియాలని ఆయన డిమాండ్ చేశారు!

విజయసాయిరెడ్డి అడగంతోనే ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నానని తన భార్య శాంతినే చెప్పిందని మదన్ మోహన్ తెలిపారు. అయితే ఆ హాస్పటల్ వివరాలు చెప్పడం లేదని అన్నారు. ఏది ఏమైనా... ఎవరి బిడ్డ అని తెలిసేంత వరకూ తన పోరాటం ఆగదని మదన్ మోహన్ స్పష్టం చేశారు. ఐవీఎఫ్ డాక్యుమెంట్లపై సుభాష్ అనే వ్యక్తి సంతకం కూడా ఉందని.. అతనితో మాట్లాడితే ఆ బిడ్డకూ తనకూ ఏమీ సంబంధం లేదని అన్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే... సుభాష్ తో పాటు విజయసాయిరెడ్డిపై తనకు అనుమానం ఉందని, వాళ్లిద్దరూ కూడా డీ.ఎన్.ఏ. టెస్ట్‌ కు రావాల్సిందేనన్నారు. ఆ బిడ్డకు ఫాదర్ ఎవరో తెలియాలని.. తాను అమెరికాలో ఉండగా రెండేళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలల సమయం పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఎవిడెన్స్ లూ ఉన్నాయని, దయ చేసి సత్యాన్ని బతికించాలని మదన్ మోహన్ మీడియాను కోరారు.

ఈ సమయంలోనే విజయసాయిరెడ్డి, సుభాష్ లపై తనకు అనుమానం ఉందని.. ఎవరైనా సరే డీ.ఎన్.ఏ. టెస్ట్ కు రావాల్సిందేనని.. ఇది తన జీవితం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని అన్నారు. ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా ముందు సాస్టాంగ నమస్కారం చేసి, బేషరతుగా సారీ చెబుతానని తెలిపారు. ఒక వేళ ఉంటే మాత్రం తర్వాత ఏమిటనేది తనకు తెలియదని అన్నారు.

Full View
Tags:    

Similar News