"ఎవరు నేర్పేరమ్మ... ఈ సంస్కృతి!!"
ఇక, తాజాగా పుంగనూరులో జరిగిన ఘర్షణ, ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి కూడా.. ఖండించా ల్సిందే. పార్టీలు
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆవేదన... ఆక్రందనలకు దారి తీస్తున్నాయి. నడిరోడ్డుపై నరికేస్తున్నా.. నాయకులను అడ్డుకుంటున్నా.. అడిగేవారు.. ప్రశ్నించేవారు లేకుండా పోతున్నారనే ఆందోళన వ్యక్తమ వుతోంది. తాజాగా వినుకొండ ప్రాంతంలో జరిగిన దారుణ హత్య అంరినీ కలచి వేసింది. దీనిలో రాజకీయా లను పక్కన పెట్టి చూస్తే.. మనకు చట్టం.. న్యాయం.. పోలీసు వ్యవస్థలపై భయం.. నమ్మకం ఉందా.. లేదా? అనే ప్రశ్నలకు తావిచ్చింది.
అరటి చెట్టును నరికినంత ఈజీగా.. ఒక వ్యక్తి నడిరోడ్డుపై నరకడం.. ఇటీవల కాలంలో కామన్ అయిపో యింది. ఇక, తాజాగా పుంగనూరులో జరిగిన ఘర్షణ, ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి కూడా.. ఖండించా ల్సిందే. పార్టీలు ఏవైనా.. రాజకీయాలు ఎలా ఉన్నా.. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఈ రోజు మిథున్ రేపు.. మరొకరు కావొచ్చు. ఇవన్నీ ఖండనీయ అంశాలే. అయితే.. ఎవరు నేరేరమ్మ ఈ సంస్కృతి! అని తరచి చూసుకుంటే.. వైసీపీ వైపే వేళ్లు చూపిస్తున్నాయి.
రెండేళ్ల కిందట జేసీ ప్రభాకర్ ఇంటిపై సాక్షాత్తూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దౌర్జన్యం చేసినప్పుడు.. సీసీ కెమెరా లు ధ్వంసం చేసి.. వికటాట్టహాసం చేసినప్పుడు.. జగన్ సీఎంగా ఉండి ఖండించలేక పోయారు. అప్పుడు కూడా.. ఇప్పుడు జగన్ ప్రశ్నించినట్టే.. శాంతిభద్రతలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి. పుంగనూరు సరిహద్దులో అంగళ్లు సెంటర్‌లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలువరించి.. రాళ్ల దాడికి పురికొల్పినప్పుడు.. కూడా.. శాంతి భద్రతలు.. ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి.
ఇవి మచ్చకు రెండు ఉదాహరణలు మాత్రమే. ఇదే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగించిన అరాచక పర్వంతో టీడీపీ నాయకులు తలోదిక్కుకు పోయి.. తలదాచుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేతిలోనే ఉన్నాయి. నాడు ఈ సంస్కృతిని పెంచి పోషించిన పాపం ముమ్మాటికీ.. జగన్‌కే దక్కుతుంది. కాగా, నేడు.. నూరు గొడ్లు తిన్న రాబందు శాంతి ప్రవచనాలు చెప్పడమే విడ్డూరంగా మారింది. పోనీ.. ఇప్పటికైనా రియలైజ్ అయ్యారా? అది కూడా చూద్దాం.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డలో అదే బుధవారం(వినుకొండలో వైసీపీ కార్యకర్తను నరికేసిన రోజే) టీడీపీ కార్యకర్తను వెంటాడి వేటాడి తరిమి తరిమి చంపేశారు. దీనిని కూడా జగన్ ఖండించి ఉంటే.. తన వారి తప్పులను కూడా తప్పుబట్టి ఉంటే.. మారిన జగన్‌ను అందరూ మెచ్చుకునే వారు. ఇక, పల్నాడు జిల్లాలో ఇదే రోజు(బుధవారం) టీడీపీ నేతను వైసీపీ నాయకులు చంపేందుకు ప్రయత్నించారు. అయితే.. అదృష్టవశాత్తు ఆయన లేకపోవడంతో ఆయనకు చెందిన కోటి రూపాయల విలువ చేసే.. వాటర్ ప్లాంటును ధ్వంసం చేశారు. దీనిని కూడా జగన్ ఖండించి.. సుద్దులు చెప్పిఉంటే.. నమ్మేవారు. కానీ, తన కాళ్ల కిందకు నీరు వచ్చే వరకు.. మౌనంగా ఉండి.. ఇప్పుడు శోకిస్తే.. ప్రయోజనం ఏంటి?!!