మహానగరం మాయ.. ఒక్క గది ఇంటికి రెంట్ ఎంతో తెలుసా?

ముంబయిలోని మతుంగా ఏరియా లోనీ ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న ఇంటికి 45 వేల రూపాయల రెంట్ డిమాండ్ నడుస్తోంది.

Update: 2024-10-04 13:30 GMT

సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న కొద్ది నగరాలలో అద్దె ఇంటి బాడుగ కూడా విపరీతంగా పెరుగుతుంది. బ్రతుకుతెరువు కోసం ఉన్న ఊరిని.. అయిన వాళ్ళని వదులుకొని పట్నానికి వచ్చిన ఉద్యోగస్తులకు ఇంటి బాడుగ భారం అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి అద్దె మధ్యతరగతి బడ్జెట్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసినా ఓ ఇంటి అద్దె అందరికీ హడలు పుట్టిస్తోంది.

మామూలుగా మనకు అనువైన బడ్జెట్లో మంచి ప్లేస్ లో ఇల్లు దొరకడం అనేది మహానగరాలలో కాస్త కష్టమైన విషయం. ఏదో ఒక దానికి కాంప్రమైజ్ అయితే తప్ప మన బడ్జెట్లో ఇల్లు దొరకడం కష్టం. అలాంటిది ఒక చిన్న గది.. రెం టుకి వేళలో డిమాండ్ చేస్తున్నారు అంటే ఎలా ఉంటుందో చెప్పండి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం.. ముంబై మహానగరంలో ఒకే ఒక గది కోసం ఆ ఓనర్ 45 వేల రూపాయల అద్దె డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అంత కాస్ట్లీ గది స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి..

ముంబయిలోని మతుంగా ఏరియా లోనీ ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న ఇంటికి 45 వేల రూపాయల రెంట్ డిమాండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఇల్లు అంటే ఏదో పెద్దది అనుకునేరేమో.. కేవలం ఒక చిన్న హాల్, అంతకంటే చిన్న బెడ్ రూమ్.. ఒక మనిషి పట్టే వంటగది ఉన్నాయి. ఇక ఇంట్లో ఎక్కువ వస్తువులు అమర్చడానికి స్థలం కూడా లేదు.

ఇది కేవలం ఆ ఇంటి పరిస్థితి మాత్రమే కాదు.. ప్రస్తుతం నగరంలోని ఎన్నో ప్రాంతాలలో ఇల్లు ఇదే రకంగా ఉంటున్నాయి. ఒక చిన్న గది కట్టే స్థలంలో ఇంటిని కట్టి ఎత్తున అద్దవశులు చేస్తున్నారు యజమానులు. అయితే ఇంటికి సంబంధించిన వీడియో పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘ఇంత చిన్న ఇంటికి 45 వేల రూపాయలా?’..’సామాన్యులు ఇంత రెంట్ కట్టాలి అంటే ఎలా?’..’వచ్చిన జీతం రెంట్ కు సరిపోయేలా ఉంది’..’ ఆయినా ఇలా ఇంత రెంట్ ఎలా అడగగలుగుతున్నారు?’ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News