ఎలన్ మస్క్.. నీకు మానవత్వం లేదా?

అమెరికా సరిహద్దుల్లో పెరుగుతున్న అక్రమ వలసల నివారణ చర్యల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-02-19 23:30 GMT

అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వలసదారులను దేశం నుంచి ట్రంప్ ప్రభుత్వం వారి దేశాలకు పంపించేస్తోంది.. తాజాగా, వైట్‌హౌస్ తన ఎక్స్ ఖాతాలో 41 సెకన్ల వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో అధికారులు అక్రమ వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేస్తూ తీసుకెళుతున్న దృశ్యాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. అమెరికా సరిహద్దుల్లో పెరుగుతున్న అక్రమ వలసల నివారణ చర్యల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ వీడియోపై ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించడంతో పెద్ద వివాదం చెలరేగింది. వైట్‌హౌస్ పోస్ట్ చేసిన ఈ హృదయ విదారక దృశ్యాల వీడియోను మస్క్ రీట్వీట్ చేస్తూ "వావ్" అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు, రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

- ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై వ్యతిరేకత

ఎలాన్ మస్క్ స్పందనను కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. వలసదారుల కోసం పోరాడే అనేక మానవహక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు మస్క్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. "ఇంత బాధాకరమైన పరిస్థితిని వావ్ అనడం ఏమిటి?" అంటూ పలువురు మండిపడుతున్నారు.

- మస్క్‌కు మద్దతుగా కొందరు

అయితే మస్క్ వ్యాఖ్యలను సమర్థించే కొందరు కూడా ఉన్నారు. అమెరికా సరిహద్దుల్లో అక్రమ వలసలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను సమర్థించేవారు మస్క్ వ్యాఖ్యలను ఒక ప్రశంసగా భావిస్తున్నారు.

- వైట్‌హౌస్ ఉద్దేశం ఏమిటి?

ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా అమెరికాలోకి అక్రమంగా రావాలనుకునే వలసదారులకు హెచ్చరిక ఇవ్వాలని వైట్‌హౌస్ భావించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలసదారుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

ఎలాన్ మస్క్ ఈ వీడియోపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ప్రభుత్వ చర్యలు, మస్క్ వ్యాఖ్యలపై చర్చ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. అమెరికా వలస విధానంపై ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News