మోడీ ఎన్నికల స్ట్రాటజీ.. మరోసారి రిపీట్!
ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనేక వ్యూహాలు ఉంటాయి. సెంటిమెంటుతో కొందరు.. డబ్బు తో కొందరు చెలరేగుతున్న పరిస్థితి కామన్ అయిపోయింది.
ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనేక వ్యూహాలు ఉంటాయి. సెంటిమెంటుతో కొందరు.. డబ్బు తో కొందరు చెలరేగుతున్న పరిస్థితి కామన్ అయిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమ యంలో కూడా పార్టీలు, నాయకులు ఇదే పంథాను అనుసరించాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహం చిత్రంగా ఉంటుంది. పైకి చాలా కూల్‌గా ఉంటూనే మరోవై పు.. దాని వెనుక పక్కా వ్యూహం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆయన అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నా రు.
ఎన్నికల ప్రచారం ముగియగానే.. గత ఏడాది.. మోడీ.. తమిళనాడులోని వివేకానంద మెమోరియల్‌కు వెళ్లిపోయారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. సముద్ర స్నానాలు చేశారు. ధ్యానమగ్నులై.. దీక్ష చేపట్టారు. పూర్తిస్థాయిలో కాషాయ వస్త్ర ధారిపై హిందూ వర్గాల మనసు దోచుకున్నారు. ఇది .. ఆ ఎన్నిక ల్లో ఓడిపోతుందని లెక్కలు వేసుకున్న కమల దళాన్ని మరోసారి వికసించేలా చేసిందన్న విశ్లేషణలు రావడం తెలిసిందే. ఇది ఈ ఒక్కసారే కాదు.. గతంలోనూ ఆయన ఇలానే వ్యవహరించారు.
దేశంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న హిందువులను తనవైపు తిప్పుకొనే క్రమంలో మోడీ అనుసరిం చే కీలక వ్యూహం ఇదేనని.. మోడీని విమర్శించే వారు తరచుగా చెబుతుంటారు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారు. బీజేపీ అయితే.. మరీ గట్టిపట్టుదలతో ఉంది. దేశ రాజధానిలో కమల వికాసం కోసం పరితపిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే మోడీ.. మహాకుంభమేళాకు వెళ్తుండడం గమనార్హం.
ఈ నెల 5న అంటే బుధవారం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 70 అసెంబ్లీస్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అదే రోజు ప్రధాని మోడీ మహాకుంభమేళాకు హాజరు కావడం.. ఆయన స్నానం, జపం, ధ్యానం వంటివి ప్రోగ్రాములు నిర్వహించడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నా యి. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కాకపోగా.. ఎన్నికలను ప్రభావితం చేసే మంత్రంగా ఉంటుం దని కమల నాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఢిల్లీలో అగ్రవర్ణాల ఓట్లే ఎక్కువగా ఉండడం.. హిందూత్వ ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో మోడీ చేస్తున్న ఈ `మేళా` వ్యూహం ఫలించే అవకాశంపై చర్చ జరుగుతోంది.