గ్లోబల్ లీడర్ గా మోదీకి అత్యధిక ప్రజాదరణ!

ప్రపంచ నాయకులపై నిర్వహించిన సర్వేలో మన ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు

Update: 2023-12-09 06:54 GMT

ప్రపంచ నాయకులపై నిర్వహించిన సర్వేలో మన ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. యూఎస్ కు చెందిన కన్సల్టెన్సీ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ ప్రకారం దేశంలో 76 శాతం మంది మోదీ నాయకత్వానికే జై కొడుతున్నారని తేల్చింది. కేవలం 18 శాతం మంది మాత్రమే మోదీ నాయకత్వాన్ని ఇష్టపడటం లేదని తెలిపింది. ఇప్పటికే పలు సర్వేల్లో మోదీ చరిష్మా ఇంకా తగ్గలేదని నిరూపించాయి. ఈ నేపథ్యలో ఈ సర్వే కూడా మోదీకున్న జనాదరణను తెలియజేసింది.

గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ప్రపంచ నేతల్లోనే ప్రధాని అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆరు శాతం మంది మాత్రం తమ అభిప్రాయాలు వెల్లడించలేదు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడోర్ కు 66 శాతం ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ కు 58 శాతం రేటింగ్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 37 శాతం మంది జై కొట్టారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు 31శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు 25 శాతం మంది, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు 24 శాతం మంది ప్రజల ఆమోదం దొరికింది.

గ్లోబల్ నిర్వహించిన గత సర్వేల్లోనూ మన ప్రధాని మోదీ అగ్రస్థానంలోనే నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో మోదీ చరిష్మాతోనే బీజేపీ విజయం సాధించింది. ఇక త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసగిస్తుందని అంచనా వేస్తున్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించడం ఖాయమని చెబుతున్నారు.

ప్రపంచ నాయకుల్లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ గుర్తింపు సాధించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కన్నా రేటింగ్ లో ముందు నిలవడం విశేషం. మహామహులున్నా మోదీ తన శక్తియుక్తులతో ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. తనదైన మార్గనిర్దేశంలో భారత్ ముందంజలో నిలుస్తోంది. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడంలో ఆయన ముందంజలో నిలుస్తున్నారు. అందుకే ప్రజల ఆదరణ తగ్గడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

ముచ్చటగా మూడో సారి నెగ్గి హ్యాట్రిక్ కొట్టి చరిత్రను తిరగరాయాలని భావిస్తున్నారు. దీనికి గాను ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో బీజేపీ పవనాలు వీచేందుకు మోదీనే కారణంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మోదీకి ఉన్న విలువను వినియోగించుకుని మంచి పొజిషన్ పొందాలని భావిస్తున్నాయి. ఇలా మోదీ గుర్తింపును తమకు అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయని పలువురు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News