పీఎం ఆఫర్స్ పై గడ్కరీ వ్యాఖ్యలు... తెరపైకి ఆసక్తికర విషయాలు!

ఈ సమయంలో ఆయనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందంటూ వచ్చిన కథనాలు వైరల్ అవుతున్న వేళ... వీటిపై ఆయన వివరణ ఇచ్చారు.

Update: 2024-09-27 04:13 GMT

బీజేపీ జాతీయ నాయకుల్లో నితిన్ గడ్కరీకి సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉంటుందని అంటుంటారు. ఉన్నంతలో నిజాయతీపరుడైన నాయకుడిగా ఆయనను గుర్తిస్తుంటారని చెబుతారు. ఈ సమయంలో ఆయనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందంటూ వచ్చిన కథనాలు వైరల్ అవుతున్న వేళ... వీటిపై ఆయన వివరణ ఇచ్చారు.

అవును... కేంద్రమంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ తనకు ప్రతిపక్ష పార్టీ ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసిందనే వార్తలపై స్పందించారు. ఇందులో భాగంగా... ప్రధానమంత్రి పదవి తీసుకుంటానంటే సపోర్ట్ చేస్తానంటూ అపోజిషన్ నేత కూడా ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్థావించారు.

తనకు ప్రతిపక్ష పార్టీ ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసినప్పుడు.. మీరు నన్ను ఎందుకు ప్రధాని చేయాలనుకుంటున్నారని.. తాను మోడీతో ఎందుకు ఉండకూడదని తాను వారిని అడిగినట్లు చెప్పారు. ఇదే సమయంలో... ప్రధాని కావడం తన ఆశయం కాదని ఇండియా టుడే కాంక్లేవ్ లో గడ్కరీ అన్నారు.

ఇదే సమయంలో... ప్రధానమంత్రి మోడీకి ప్రత్యామ్నాయం కావాలని అడిగినప్పుడు.. తాను రేసులో లేనని, ప్రస్తుతం ఉన్న చోట సంతోషంగానే ఉన్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఇదే సమయంలో తాను ఏ జాతిలోనూ లేనని.. తన బయోడేటా ఎవరికీ ఇవ్వలేదని.. తన తాను చేస్తూ.. ఎక్కడ ఉన్నానో అక్కడ సంతోషంగా ఉన్నాను అని గడ్కరీ అన్నారు.

ఇక మిగిలిన విషయాలపై ప్రధాని మోడీని.. లేదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ని అడగండి అని సీనియర్ బీజేపీ నేత స్పష్టం చేశారు. ఇక తాను పార్టీ కార్యకర్తని అని, ఆర్.ఎస్.ఎస్. సభ్యుడిని అని చెప్పిన గడ్కరీ.. తనకు మంత్రి పదవి రాకపోయినా ఇబ్బందిపడనని.. తాను దేని గురించీ చింతించనని స్పష్టం చేశారు.

Tags:    

Similar News