ఆన్ లైన్ లో చూసి దొంగతనానికి పథకం?

కష్టపడి సంపాదించేది ఎక్కడికి పోదు అన్నట్లు మన కష్టమే మనకు శ్రీరామరక్షగా గుర్తుంచుకోవాలి.

Update: 2024-05-15 09:13 GMT

ఉన్న దాంతో సరిగా ఉండక ఆన్ లైన్ జూదాలు ఆడి బతుకు చిద్రం చేసుకుంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కటకటాలపాలవుతున్నారు. బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. తమ కెరీర్ కు తూట్లు పొడుచుకుంటున్నారు. ఏదో సాధించాలనే తపనతో ఊచలు లెక్కపెడుతున్నారు. ఓ సినిమాలో కష్టపడకుండా సంపాదించేదేదీ నిలవదు. కష్టపడి సంపాదించేది ఎక్కడికి పోదు అన్నట్లు మన కష్టమే మనకు శ్రీరామరక్షగా గుర్తుంచుకోవాలి. కానీ అప్పనంగా వచ్చేది ఏదీ నిలవదు. ఆగాన వచ్చేది భోగాన పోతుందట.

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కష్టపడకుండా డబ్బు సంపాదించడమెలా అని ఆలోచిస్తున్నారు కానీ కష్టపడి సంపాదిస్తామనే ఆశ ఎవరిలో కనిపించడం లేదు. సినిమాల ప్రభావమో ఏమో కానీ దొంగతనాలు, దోపిడీలు చేసి బాగా ధనవంతులం కావాలని కలలు కంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.

మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్ లైన్ జూదం ఆడి రూ. 5 లక్షల వరకు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును ఎలా సంపాదించాలని ఓ పథకం వేశాడు. దీనికి దొంగతనమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాడు.

యూ ట్యూబ్ లో బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలి? దానికి కావాల్సిన వస్తువులేమిటి? అనే విషయాలు తెలుసుకున్నాడు. ఇక ఓ రోజు ముహూర్తం నిర్ణయించుకుని ఓ ఫైనాన్స్ సంస్థ తలుపులు బద్దలు కొట్టాడు. అటుగా పెట్రోలింగ్ కు వెళ్తున్న ఎస్ఐ శాంతి, కానిస్టేబుల్ అన్బుకుమార్ లను చూసి పరారయ్యాడు. అక్కడే నిలిపిన బైక్, దొంగతనానికి అవసరమైన పరికరాలు గుర్తంచారు.

తరువాత లెనిన్ ను అరెస్టు చేశారు. దొంగతనానికి ప్రయత్నించిన నేరంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనవసర ఆటలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చక్కగా ఉద్యోగం చేసుకోవాల్సిన లెనిన్ తప్పుదారిలో వెళ్లి తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం కూడా మనకు ఉన్నంతలో ఖర్చు పెట్టుకోవాలి. జల్సాలకు పోయి బతుకును దుర్లభం చేసుకోవడం మంచిది కాదు.

Tags:    

Similar News