మహిళల మిస్సింగ్ పై ఆసక్తికర అప్ డేట్... పవన్ కీలక వ్యాఖ్యలు!

సుమారు 30,000 మందికి పైగా అమ్మాయిలు మిస్సయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-19 11:39 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వారాహి యాత్రలో భాగంగా.. మహిళలు & బాలికల మిస్సింగ్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... సుమారు 30,000 మందికి పైగా అమ్మాయిలు మిస్సయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై పెద్ద దుమారమే రేగింది.

దీంతో... ఏపీలో కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత.. ఈ విషయంపై పవన్ కు విపక్షాల నుంచి ఎదురు ప్రశ్నలు రావడం మొదలయ్యింది. ఇందులో భాగంగా.. మిస్సయిన 30,000 మంది అమ్మాయిలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో... ఏపీలో మిస్సయిన 18 మంది మహిళలు, బాలికలను విజయవాడ పోలీసులు ఛేదించారనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... అతి తక్కువ వ్యవధిలో 18 మంది తప్పిపోయిన మహిళలు, బాలికల కేసులను ఛేధించిన విజయవాడలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అభినందనలు.. ఈ ఘటన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి దార్శినికతకు నిదర్శనం అంటూ విజయవాడ సిటీ పోలీస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ... వైసీపీ పాలనలో 30,000 మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని.. అయితే, దీనిపై వైసీపీ ప్రభుత్వం నాడు చర్యలు తీసుకోకపొవడమే కాదు.. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు అని మండిపడ్డారు. అయితే... ఇప్పుడు మార్పు వచ్చిందని.. ఏపీలో పటిష్టమైన లా & ఆర్డర్ కి ఎన్డీయే హామీ ఇచ్చిందని అన్నారు.

ఇదే సమయంలో... విజయవాడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తాజాగా పలు కేసులను ఛేదించినందుకు తాను ఇవాళ గర్వపడుతున్నాను అని చెప్పిన పవన్.. హోంమంత్రి అనిత నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులకు, హోంమంత్రిత్వ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలో.. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సోషల్ మీడియా దుర్వినియోగం నుంచి రక్షణతో సహా మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసు శాఖకు పూర్తిగా మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీ పౌరులు అప్రమత్తంగా ఉండి.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా, భద్రంగా మార్చడానికి సహకరించాలని.. ఇది తన విజ్ఞప్తి అని పవన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News