బొత్సకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశారా ?
ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపునకు మార్గం సుగమం అయింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపునకు మార్గం సుగమం అయింది. టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిని పెట్టకపోవడంతో ఆయన విజయం దాదాపుగా ఖరారు అయిపోయింది. ఇది కూటమి వైపు నుంచి ఊహించని ట్విస్ట్. ఎందుకు ఇలా జరిగింది అంటే వైసీపీ నేతల వెర్షన్ ఏంటి అంటే టీడీపీ కూటమికి అసలు ఎక్కడా బలం లేదు కాబట్టే ఇలా చేశారు అని.
కానీ రాజకీయాల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి. టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కావాలీ అనుకుంటే సామదానభేద దండోపాయాలు కూడా వాడేసి గెలుపు నమోదు చేసుకోగలదు అని అంటున్నారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నపుడు కడప లో ఇలాగే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నా టీడీపీ నాడు పట్టుబట్టి మరీ ఓడించింది.
మరి ఈసారి ఎందుకు అలా చేయలేదు అంటే తెర వెనక కధలు అనేకం వినిపిస్తున్నాయి. నిజానికి టీడీపీ కూటమి అభ్యర్ధిని నిలబెట్టకూడదు అన్న నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఎన్నికల మీద సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు. బెంగళూరు లో క్యాంపు రాజకీయాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్ తన పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయడంలో బిజీ అయ్యారు కూడా.
ఒక విధంగా వైసీపీ గట్టిగా చమటోడ్చాలనే అనుకుంది. ఫలితం విషయంలో మాత్రం టెన్షన్ ఉంటూనే ఉంది. నిజానికి వైసీపీకి లోకల్ బాడీస్ లో పూర్తి మెజారిటీ ఉంది. అయినా కూడా కూటమి తలచుకుంటే వాళ్ళను లాగేయడం పెద్ద సమస్య అయితే కాదనే అంటున్నారు.
ఇక బొత్స అభ్యర్ధిత్వం పట్ల వైసీపీలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయన లోకల్ కూడా కాదు, మరి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కూడా టీడీపీ కూటమి అభ్యర్ధిని పెట్టకపోవడం అంటేనే దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే పెద్ద తతంగమే ఉంది అని అంటున్నారు.
బొత్స విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన బలమైన నేతగా ఉన్నారు. ఇక సామాజిక వర్గం పరంగా చూస్తే కనుక ఆయన తూర్పు కాపు. అంటే బలమైన బీసీ నేత ప్లస్ కాపు అన్న మాట. దీంతోనే రూమర్స్ పొలిటికల్ గా అనేకం చక్కర్లు కొడుతున్నాయి. బొత్స పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ కూటమి తన మీద అభ్యర్థిని పెట్టకుండా చూసుకున్నారు అని అంటున్నారు.
దీంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కన్విన్స్ చేసి మరీ పోటీకి పెట్టకుండా ఒప్పించగలిగారు అని టాక్ అయితే నడుస్తోంది. మరి బొత్సకు పవన్ ఈ విధంగా ఎందుకు ఫేవర్ చేశారు అన్నది కూడా చర్చగా ఉంది. బొత్సకు పవన్ కి మధ్య అనుబంధం అయితే గతంలో నుంచి ఉంది. ఆయనతో బొత్సకు మంచి పరిచయాలు సినీ రంగంలో హీరోగా ఉన్నపుడే ఉన్నాయని అంటున్నారు.
అంతే కాదు బొత్స కూడా ఎపుడూ పవన్ ని గట్టిగా విమర్శించిన దాఖలాలు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒక్కటే కులస్తులు. దాంతోనే పవన్ కూడా బొత్సకు అదే క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనే మద్దతుగా నిలిచి హెల్ప్ చేశారు అని అంటున్నారు.
ఇక పవన్ ఆలోచనలు అన్నీ 2029 ఎన్నికల మీద ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో పవర్ ఫుల్ లీడర్ జనసేనకు పవన్ కి కావాలీ అని అంటున్నారు. అలా బొత్సకు హెల్ప్ చేయడం ద్వారా ఈ రోజుకు ఆయన దగ్గర అయినట్లే అంటున్నారు. ఈ హెల్ప్ ని పవన్ రాబోయే రోజులలో వాడుకుంటారు అని అంటున్నారు. అంటే కీలక సమయంలో బొత్సని జనసేనకు లాభం కలిగేలా వాడుకుంటారు అని చర్చ అయితే సాగుతోంది.
జనసేన విస్తరణకు అలాగే ఉత్తరాంధ్రలో బొత్స లాంటి లీడర్ ని తమ వైపు తిప్పుకునేందుకే పవన్ ఈ రకంగా వ్యవహరించారు అని అంటున్నారు. అంటే కూటమి అభ్యర్ధిని నిలబెట్టకుండా చంద్రబాబుతో చెప్పించి ఒప్పించడం అంటే ఇది జనసేన కు బొత్సకు మధ్య భవిష్యత్తు అండర్ స్టాండింగ్ కి పొలిటికల్ గా పునాది అని కూడా విశాఖలో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.
మరో వైపు చూస్తే ఆ మధ్య దాకా బొత్స జనసేనలోకి వెళ్తారు అని టాక్ కూడా నడిచింది. ఆయన వైసీపీ ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండడంతో ఆ వార్తలు ప్రచారం జరిగాయి. ఏది ఏమైనా ఎక్కడో లింక్ ఉంటుంది. దానిని బట్టే పుకార్లు వస్తాయని నమ్మే వారూ ఉన్నారు. ఇపుడు కూటమి డెసిషన్ తో ఆ వార్తలను గుర్తు చేసుకుంటున్న వారూ ఉన్నారని అంటున్నారు. మరి ఈ హెల్ప్ కి ప్రతిఫలం ఏమిటి అన్నది ఫ్యూచర్ పాలిటిక్స్ లో తెలుస్తుంది అని అంటున్నారు.