అత్త‌మ్మే సీఈవో.. బుట్ట‌లో వేసిన అంబానీ కోడ‌లు

నీతా అంబానీ గురించి రాధిక మర్చంట్ ఇలా వ్యాఖ్యానించారు..''అత్త‌య్య (నీతాజీ) నిబద్ధత...దూర‌ దృష్టి మా మొత్తం వేడుకకు ప్రాణం పోసింది..ఆమె ఈ వేడుక‌కు సీఈవో'' అని రాధిక వోగ్‌తో అన్నారు.

Update: 2024-07-15 13:30 GMT

అంబానీల ఇంట కోడ‌లుగా అడుగుపెట్టింది రాధికా మ‌ర్చంట్. ఈ తెలివైన గ‌డుస‌రి కోడ‌లు అప్పుడే అత్త‌గారిని బుట్ట‌లో వేసేస్తోంది. అందుకు నిద‌ర్శ‌నం ఈ పొగ‌డ్త‌. ''అత్త‌మ్మ నా పెళ్లికి సీఈవో'' అని పొగిడేసింది కోడ‌లు పిల్ల‌. రాధికా మర్చంట్ నీతా అంబానీని 'సిఇఓ ఆఫ్ వెడ్డింగ్' అని తెలిపింది. అత్తగారు.. ఇషా అంబానీ, శ్లోకా మెహతా ప్రణాళికలో ఎలా సహాయం చేసారో కూడా రాధిక వెల్ల‌డించారు.

అంబానీల‌ విలాసవంతమైన వివాహాన్ని మనమంతా క‌నులారా చూసాము. ఇది ఒక క‌ల లాంటిది. క‌ల‌లోనైనా ఇలాంటిది చూడ‌లేం. అయితే ఇంత‌టి భారీ ఈవెంట్‌ వెనుక ఉన్న ప్లానింగ్, డ్రెస్‌లు, బ‌హుమ‌తులు.. మరెన్నో ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. నీతా అంబానీ వీట‌న్నిటినీ నిర్వ‌హించిన‌ అధిపతి అని కోడ‌లు పిల్ల వెల్ల‌డించింది. ఇటీవల రాధికా మర్చంట్ వోగ్‌తో మాట్లాడుతూ- తన అత్తగారు వివాహానికి CEO అని త‌న ప్రేమాభిమానాల్ని వ్య‌క్తం చేసింది. నీతా అంబానీ గురించి రాధిక మర్చంట్ ఇలా వ్యాఖ్యానించారు..''అత్త‌య్య (నీతాజీ) నిబద్ధత...దూర‌ దృష్టి మా మొత్తం వేడుకకు ప్రాణం పోసింది..ఆమె ఈ వేడుక‌కు సీఈవో'' అని రాధిక వోగ్‌తో అన్నారు.

వివాహ‌ ప్రణాళికను ఇషా అంబానీ - శ్లోకా మెహతా పర్యవేక్షించారని కూడా తెలిపారు. నాన్‌స్టాప్‌గా పని చేస్తూ కొన్ని వారాల పాటు సాగిన ఈ వేడుకను ప‌ర్ఫెక్ట్ గా డీల్ చేయ‌డానికి అంబానీ కుటుంబం అంతర్గత సిబ్బందిని, ఈవెంట్ ప్లానర్‌ల బృందాలను నియమించింది. రాధిక మాట్లాడుతూ.. జ్యోతిష్యుల ప్ర‌కారం.. పెళ్లి వేడుకలకు ప్ర‌తిదీ ప్లాన్ చేసాం. మా కుటుంబ పూజారి సలహా మేరకు జూలై 12, 13, 14 తేదీలను వ్యూహాత్మకంగా ఎంచుకున్నామ‌ని తెలిపారు.

అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అనేక మంది సినీ ప్రముఖులు, ప్రపంచ స్థాయి నాయకులు, రాజకీయ నాయకులు, దేశాధ్య‌క్షులు, పాప్ స్టార్లు, సోషల్ మీడియా ప్రభావశీలురు హాజరయ్యారు. ఎట్ట‌కేల‌కు మూడు రోజుల వివాహ వేడుకలు నిన్నటి (జూలై 15) రోజున ముగిశాయి. పెళ్లికి ముందు ఈ జంట రెండు ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకున్నారు.

మొదటి వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. మరొకటి ఇటలీలో క్రూయిజ్ విహారయాత్రలో జరిగింది. ఈ రెండు వేడుకలకు అనేక మంది అతిథులు విచ్చేశారు. మొత్తం పెళ్లి వేడుక‌ల కోసం సుమారు 5000 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని తెలుస్తోంది. ఇది బిలియ‌నీర్ అంబానీ సంప‌ద‌ల విలువ‌లో 0.5 శాతం అని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News