జగన్ గురించి మాట్లాడను...రఘురామ నర్మగర్భ వ్యాఖ్యలు

యన గురించి మాట్లాడను అని సంచలనం రేపారు. అంతే కాదు జగన్ గురించి కాదు ఇపుడు కూటమి ప్రభుత్వం మీదనే ప్రభుత్వం దృష్టి ఉందని కామెంట్స్ చేశారు.

Update: 2024-06-13 12:42 GMT

ట్రిపుల్ ఆర్ గా పేరు గడించిన రఘురామ క్రిష్ణం రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి తాను ఇక మీదట వ్యక్తిగత విమర్శలు చేయను. ఆయన గురించి మాట్లాడను అని సంచలనం రేపారు. అంతే కాదు జగన్ గురించి కాదు ఇపుడు కూటమి ప్రభుత్వం మీదనే ప్రభుత్వం దృష్టి ఉందని కామెంట్స్ చేశారు.

ఎప్పటికీ ప్రజలే గొప్పవారు అని ఆయన అన్నారు. 151 సీటు వైసీపీకి ఇచ్చింది, టీడీపీ కూటమికి 164 సీట్లు ఇచ్చింది కూడా ప్రజలే అని అన్నారు. ఓడినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ వచ్చిందని అలాగే 2019లో టీడీపీకి 40 శాతం ఓటు షేర్ ఉందని చెప్పారు. ఈ మధ్యలో పదిహేను నుంచి ఇరవై శాతం ప్రజలే అన్నీ నిర్ణయిస్తారు అని అన్నారు.

తమకు అధికారం అన్నది ఒక బాధ్యత అన్నారు. తాము ఏమి చెప్పి అధికారంలోకి వచ్చామన్నది ముఖ్యం అన్నారు. తాము ఎలా పాలిస్తామని ప్రజలు గమనిస్తారు అని అన్నారు. అదే సమయంలో మా ప్రభుత్వం అని ఆయన అంటూ తాను మంత్రిగా లేకపోయినా మా ప్రభుత్వం అని అనవచ్చు అంటూ మాట్లాడటం చూస్తూంటే రఘురామ మంత్రి పదవి విషయంలో డిసప్పాయింట్ అయ్యారని అంటున్నారు.

ఎంపీగా వెళ్లాలనుకున్నారు. అదే కనుక జరిగితే కేంద్రంలో ఆయన బాగా ఉండేవారు. అలా జరగలేదు. పోనీ ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిచారు. కచ్చితంగా రఘురామకు మంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. ఆయన కూడా ఆశ పెట్టుకున్నట్లుగా ఉన్నారు.

కానీ అది జరగలేదు. దాంతో రఘురామ కొంత ముభావంతోనే ఉంటున్నారు అని అంటున్నారు. ఇక స్పీకర్ విషయంలోనూ ఆయన అనుకున్నది నెరవేరేదిగా లేదు అని అంటున్నారు. ఆ పదవికి బాబు ఒకరో ఒకరిని ఇప్పటికే సెలెక్ట్ చేసి ఉంటారని అంటున్నారు. అయితే అది బయట పెట్టేది సరైన టైం లోనే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే రఘురామ మాత్రం తాను జగన్ గురించి మాట్లాడబోను అంటూనే ఆయన మంచో చేడో ఏదో చేసి వెళ్లాడని ఇపుడు వాటి గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం అన్నారు. జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే రఘురామ సడెన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది చర్చగా ఉంది.

నిజానికి జగన్ ప్రభుత్వం బలంగా ఉన్నపుడు ఏపీలో ఎవరూ పెద్దగా మాట్లాడని రోజులలో గొంతెంత్తి మాట్లాడింది రఘురామే అని అంటున్నారు. ఒక విధంగా వైసీపీకి యాంటీ ఇంకెంబెన్సీని క్రియేట్ చేయడంలో రఘురామ కీలక పాత్ర పోషించారు అని అంటున్నారు. టీడీపీ కూటమి ఏర్పడడం వెనక ఆయన కూడా ఉన్నారని అంటున్నారు. ఇలా తనదైన సాయం చేసి స్టేట్ లీడర్ గా ఎదిగిన రఘురామ జస్ట్ ఎమ్మెల్యేగానే మిగిలిపోవడం అంటే ఆయనే కాదు అభిమానులు తట్టుకోలేకపోతున్నారుట.

దాంతో రఘురామ మాటలలో తేడా కనిపిస్తోంది అని అంటున్నారు. అందుకే జగన్ ని ఏమీ అనను అంటున్నారు. ఆయన గురించి ఎవరైనా మాట్లాడినా అనవసరం అని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలను అమలు చేయాలని రఘురామ అంటున్నారు అంటే ఫ్యూచర్ లో ఆయన ఏమైనా ప్రజా సమస్యల మీద మీడియా ప్లాట్ ఫారం ద్వారా మాట్లాడే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి రఘురామకు తత్వం బోధపడిందా లేక ఇంకా ఏమైనా ఆశలు మిగిలి ఉన్నాయా అంటే వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News