రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీ మృతి... డీఐజీ రియాక్షన్ ఇదే!
అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గంజేటి సత్యనారాయణ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గంజేటి సత్యనారాయణ మృతి చెందారని, బాబుకి ఇలాగే చేయాలని జగన్ కుతంత్రాలు అమలు చేస్తున్నారని, చంద్రబాబుకి జైల్లో ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని నార లోకేష్ ట్విట్టర్ లో స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ రిమాండ్ ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు.
అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గంజేటి సత్యనారాయణ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. ఇందులో భాగంగా... దోపిడీ కేసులో ఈ నెల 6న సత్యనారాయణ జైలుకు వచ్చాడని.. జ్వరం, ప్లేట్ లెట్లు పడిపోవడంతో 7న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని అన్నారు.
అనంతరం అత్యవసర వైద్య సహాయం కోసం ఈనెల 19న కాకినాడ జీజీహెచ్ కు తరలించామని అన్నారు. ఈ క్రమంలో డెంగ్యూతో బుధవారం మృతిచెందారని తెలిపారు. ఇదే సమయంలో జైలులో దోమల నివారణకు సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. ఫాగింగ్ చేస్తున్నామని.. జైలులో దోమల లార్వా ఆనవాళ్లేమీ లేవని డీఐజీ తెలిపారు.
కాగా... జైల్లో చంద్రబాబును దోమలు ఇబ్బంది పెడుతున్నాయని, ఏసీ లేదని ఆయన ఇబ్బంది పడుతున్నారని ములాకత్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో డెంగ్యూ వ్యాదితో ఒక రిమాండ్ ఖదీ మృతి చెందారనే వార్త రావడంతో లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రిమాండ్ ఖదీ మృతికి సంబంధించిన న్యూస్ ని షేర్ చేస్తూ... చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయించింది జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారుని లోకేష్ ట్వీట్ చేశారు!