రాజ్యసభ ఎంపీలు టీడీపీకి చిక్కరంతే... ఎందుకంటే ?

వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తొమ్మిది మంది ఉన్నారు.

Update: 2024-09-04 03:46 GMT

వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా టీడీపీ కూటమిలోకి వెళ్తారు అని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని ఎవరికి వారే స్వయంగా ప్రకటనలు ఇచ్చారు. అయితే అది నమ్మబుల్ గా ఉందా అంటే కచ్చితంగా ఉంది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నమ్మి తీరాల్సిందే అని కూడా రాజకీయ పరిణామాలూ చెబుతున్నాయి.

అదెలా అంటే టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మాత్రమే టీడీపీలోకి వెళ్లాలి. మరి వారు రాజీనామాలు చేస్తే మాజీ ఎంపీలుగా మిగులుతారు. ఎందుచేతనంటే టీడీపీ వారికి తిరిగి ఆ పదవిని ఇవ్వదు కనుక అని అంటున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ఖాళీలలో తమ పార్టీ వారిని తెచ్చి రాజ్యసభ సభ్యులుగా టీడీపీ చేసుకుంటుంది అని అంటున్నారు.

దానికి ఉదాహరణగా ఇటీవల వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన ఉదంతాన్ని చెబుతున్నారు. మోపిదేవి వెంకటరమణ, అలాగే బీద మస్తాన్ రావు రాజీనామాలు చేశారు. ఇందులో మోపిదేవికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు చూస్తామని హామీ మాత్రం ఇచ్చారు. అది ఎపుడు జరుగుతుంది అన్నది అయితే తెలియదు. మోపిదేవి మాత్రం మాజీ అయిపోయారు.

అయితే ఆయన పదవీ కాలం కేవలం రెండేళ్ళు మాత్రమే ఉంది. అయితే మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న బీద మస్తాన్ రావుకు కూడా మరోసారి రాజ్యసభ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు అంగీకరించడం లేదు ఆయనకు కూడా వేరే హామీలే ఇచ్చారు అని అంటున్నారు. అలా ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ ప్లేస్ లో టీడీపీ వారే ఉంటారు తప్పించి వీరికి చోటు లేదు.

ఈ విషయం అవగతం అయినాక వైసీపీ నుంచి ఎవరూ రాజీనామాల జోలికి పోలేదని అంటున్నారు. ఇందులో చూస్తే కొందరికి ఆరేళ్ల నిండు రాజ్యసభ సభ్యత్వం కూడా ఉంది. రాజ్యసభలో ఉండాలని వారికి కోరికగా కూడా ఉంది. అయితే విపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరడం అంటే కొంత ఆనందమే. కానీ ఉన్న పదవిని పోగొట్టుకుని మాజీలు కావడం మరీ బాధాకరం అని ఆలోచిస్తున్నారు. అందుకే ఎవరూ టీడీపీ గేలానికి చిక్కడం లేదు అని అంటున్నారు.

టీడీపీ వేసిన ఈ రకమైన ఎత్తుగడ వల్లనే ఎక్కువ మంది వైసీపీ నుంచి ఈ వైపునకు రాలేదు అని అంటున్నారు. టీడీపీ అలా కాకుండా మీ సీట్లు మీకు ఉంటాయి, మా వైపు వచ్చినా రాజ్యసభ సభ్యులు మీరే అని అంటే చాలా మంది ఆలోచించేవారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఆ విధంగా ఆలోచించడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా లేదు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో బలం కావాలి. తమ వారు ఉండాలని తమదైన బలమైన ముద్ర ఉండాలని కూడా ఉంది. సో అది జరిగేది కాదు. మొత్తానికి చూస్తే ఈ పరిణామాలు వైసీపీకి కొండంత నిబ్బరం కలిగించేవిగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News