అక్క‌డ గొంతు చించుకొని అరిస్తే ఏం లాభం రోజా..?

అనంత‌రం మీడియాతో మాట్లాడిత‌న రోజా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై త‌మిళంలో తిట్లందుకున్నారు.

Update: 2024-09-28 13:30 GMT

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు విలువ‌డిన త‌ర్వాత సైలెంట్ అయిపోయిన‌ మాజీ మంత్రి రోజా.. వైసీపీకి గుడ్ బై చెప్ప‌బోతున్నార‌నే వార్త‌లు తెర‌పైకి రావ‌డంతో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. పైగా ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు ఆల‌యాల‌ను వ‌రుసగా సంద‌ర్శిస్తున్నారు. అయితే అక్క‌డా రాజకీయాలే మాట్లాడుతున్నారు. కాక‌పోతే ఏపీ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం త‌మిళ మీడియా ప్ర‌తినిధుల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది.

తిరుమల లడ్డూ పవిత్రతను, విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ వైసీపీ అధిష్టానం రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించాల‌ని తమ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ మేరకు నేడు వైసీపీ క్యాడర్ పూజ‌ల్లో పాల్గొన్నారు. అయితే రోజా మాత్రం త‌న రూటే స‌ప‌రేటు అన్న చందంగా ఏపీలో కాకుండా మధురైలో వెళ్లి మీనాక్షి ఆలయాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిత‌న రోజా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై త‌మిళంలో తిట్లందుకున్నారు. చంద్ర‌బాబు ఎప్పుడు పూజ‌లు చేసిన కాళ్ల‌కు షూస్ ఉంటాయి.. ఆయ‌న‌కు దేవుడంటే భ‌యం, భ‌క్తి లేవంటూ రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా జీరో చేయాల‌న్న‌దే చంద్రబాబు కుట్రని.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకు లాగారని రోజా మండిపడ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య క్రిష్టియ‌న్‌, పిల్ల‌లు బాప్టిజం తీసుకున్నారు.. ఈ విష‌యాలు స్వ‌యంగా చెప్పిన ఆయ‌నే ఇప్పుడు స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడ‌టం షాకింగ్ గా ఉందంటూ రోజా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. రోజాపై నెటిజ‌న్లు సెటైర్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అస‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ గురించి త‌మిళ మీడియా ఎదుట గొంతు చించుకొని అరిస్తే ఏం లాభం రోజా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల చంద్ర‌బాబు కాళ్ల‌కు సాక్స్ త‌ప్ప పూజ‌లు చేసేట‌ప్పుడు షూస్ ఎప్పుడూ ధ‌రించ‌లేదు. ప‌వ‌న్ త‌న భార్య క్రిస్టియన్ అని దాచిందీ లేదు. అలాంటి వారిపై రోజా ప‌రాయి రాష్ట్రం వెళ్లి మ‌రీ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం విడ్డూరంగా మారింది

Tags:    

Similar News