సీనియర్ తమ్ముడులో ఆశలు పెరుగుతున్నాయా ?

ఆయనే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కి చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్.

Update: 2025-01-14 03:41 GMT

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలో ఆయనకే మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని అంతా ఊహించారు. ఆయన సైతం కోటి ఆశలు పెంచుకున్నారు. కానీ తీరా చూస్తే ఆయనకు మంత్రి పదవి అన్నది అందని పండుగా మారింది. ఆయనే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కి చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్.

ఆయన టీడీపీ తరఫున ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు. ఇక ఆయన గతంలో ప్రభుత్వ విప్ గా పనిచేసారు. ఈసారి ప్రభుత్వ విప్ కాదు కదా టీటీడీ మెంబర్ షిప్ అయినా దక్కలేదు. దాంతో ఆయన అనుచరులలో అసంతృప్తి పెరిగింది అన్న చర్చ సాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా మంత్రులు ఎవరూ తన ప్రశ్నలకు రియాక్ట్ కావడం లేదని చెప్పి ఆయన కొత్త రాజకీయ అసక్తిని పెంచారు.

అయితే లేటెస్ట్ గా ఆయన మళ్లీ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. అంతే కాదు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని బాగా కీరిస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు ధీటైన బదులు ఇస్తున్నారు. చంద్రబాబు లోకేష్ బాబుల సారధ్యంలో ఏపీ అభివృద్ధి విషయంలో పరుగులు తీస్తోంది అని కూడా చెబుతున్నారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేకం ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు. మరి కూన రవి కుమార్ లో ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది అంటే ఈ ఏడాది మధ్యలో మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు. అందులో కనుక కూడికలు తీసివేతలు చూసుకుంటారని దాంతో కొందరికి అయినా అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు

అలా కోటి ఆశలు అయితే కూన రవికుమార్ వర్గం పెట్టుకున్నారు అని అంటున్నారు. దాని వల్లనే ఆయన మళ్లీ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారని అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి పదవి ఉంది. అయితే ఈ రెండూ ఒకే కుటుంబానికి ఇచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే మరో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాళింగులకు మంత్రి వర్గంలో స్థానం లేదు అన్న చర్చ ఉండనే ఉంది.

ఆ లోటు భర్తీ చేయడానికి కూనని కేబినెట్ లోకి తీసుకుంటారా అన్నది కూడా హాట్ హాట్ పొలిటికల్ డిస్కషన్ గా ఉంది అని అంటున్నారు. అంతే కాదు రాష్ట్ర మంత్రి పదవులకే ప్రమాణంగా తీసుకోవాలని అలా చూస్తే రెండవ మంత్రి పదవి జిల్లాకు ఇవ్వడం సబబే అని అంటున్నారుట. మొత్తానికి అలా చూసుకుంటే కూన వర్గీయూల్లో మళ్లీ ఆశలు మొలకెత్తుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవాలు ఎంతమేరకు ఉన్నాయో.

Tags:    

Similar News