పొలిటికల్ మీటింగ్ లో రేణుదేశాయ్... తెరపైకి రెండు రకాల చర్చలు!
అవును... రేణూదేశాయ్ శుక్రవారం విజయవాడకు వచ్చారు. ఇందులో భాగంగా... ఆమె ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ఎక్కువగా ఆన్ లైన్ లో స్పందించడమే తప్ప పెద్దగా బయట ఈవెంట్స్ లో కనిపించడం తక్కువనే చెప్పుకోవాలి! అలాంటి ఆమె ఉన్నపలంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రేణూదేశాయ్ శుక్రవారం విజయవాడకు వచ్చారు. ఇందులో భాగంగా... ఆమె ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు జనసేనతో కానీ, మరో పార్టీకి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ లోనూ ఎప్పుడూ కనిపించినట్లు కనిపించని ఆమె.. తాజాగా ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బోడె రామచంద్రయాదవ్ నేతృత్వంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఈ సమయంలో ఆ పార్టీ ఆహ్వానం మేరకు రేణు దేశాయ్ విజయవాడకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... సావిత్రి బాయి పూలే జయంతి, మహిళా ఉపాధ్యాయుల గురించి మాట్లాడటానికి మాత్రమే తాను వచ్చినట్లు రేణు దేశాయ్ వెల్లడించారు.
ఇదే సమయంలో... ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు నాలెడ్జ్ చాలా ముఖ్యమని.. పిల్లల జీవితంలో తల్లి తర్వాత మహిళా టీచర్స్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా జ్యోతి బాయ్ పూలె స్ఫూర్తితో కదలాలని మహిళా టీచర్లకు, మహిళలకు రేణూ దేశాయ్ పిలుపునిచ్చారు.
అయితే.. ఆమె ఈ సందర్భంగా రాజకీయల గురించి ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ.. ఫ్యూచర్ లో ఆమె పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్ తో విభేధించే పార్టీలతో కలిసి పని చేయడానికి సైతం రేణు సిద్ధంగా ఉన్నారా అనే చర్చ నడుస్తుందని అంటున్నారు! ఏది ఏమైనా... ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మరోపక్క... ఆమె ఇప్పుడు ఇండివిడ్యువల్ మహిళ అని.. పవన్ కల్యాణ్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని.. అలాంటప్పుడు ఆమె ఏ రాజకీయ పార్టీ కార్యక్రమానికి హాజరైతే ఏమిటని.. ఆమెకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలూ ఉండవా? అంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు!