మీ దగ్గర ఎస్ బీఐ డెబిట్ కార్డు ఉందా? మిస్ కాకుండా చదవండి

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వినియోగదారులపై భారం మోపేందుకు ఓకే చెప్పేసింది

Update: 2024-03-28 04:14 GMT

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వినియోగదారులపై భారం మోపేందుకు ఓకే చెప్పేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త డెబిట్ కార్డు ఛార్జీలు వినియోగదారులపై అదనపు భారం పడేలా చేస్తాయని చెప్పక తప్పదు. కొత్త ఛార్జీలు ఏయే డెబిట్ కార్డులకు.. ఎంత మేర అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న దాని ప్రకారం ఈ బ్యాంక్ తన వినియోగదారులకు క్లాసిక్.. గ్లోబల్.. కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125లతో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తున్నారు. దీన్ని ఏప్రిల్ ఒకటి నుంచి రూ.200గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమయంలో యువ.. గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పటివరకు రూ.175 ఛార్జీలు ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి రూ.250కు పెంచారు. దీనికి జీఎస్టీ అదనం. అదే సమయంలో ప్లాటినం డెబిట్ కార్డు చార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచారు. అదే రీతిలో ఫ్రైడ్.. ప్రీమియం బిజినెస్ కార్డులపై రూ.350 వార్షిక నిర్వహణ ఛార్జీలుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.425 పెంచేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఛార్జీలకు అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేయనున్నారు.

Tags:    

Similar News