పవన్ కే ఎక్కువ భద్రత ఉండాలా ?
మరో వైపు పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఆయన తన మార్క్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.
ఏపీలో కొత్త ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పవన్ ఈ రోజు నుంచి పవర్ స్టార్ అని అంతా అంటున్నారు. దానికి కారణం పవన్ కి అలాంటి ఇలాంటి పవర్ చేతిలో పడలేదు. ఆయనకు అయంత కీలకమైన శాఖలు లభించాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అయిదు అతి ముఖ్యమైన శాఖలు పవన్ వద్ద ఉన్నాయి.
ఈ శాఖల ద్వారా పవన్ చేయాలనుకున్న న్యాయం చేయవచ్చు. ఇపుడు ఆయనకు పవర్ ఉంది. ఏమి చేయాలనుకుంటే అది చేసి అయిదు కోట్ల ఆంధ్రుల మెప్పు పొందవచ్చు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది.
వై కేటగిరీ అంటే ఇద్దరు కమెండోలతో సహా 11 మందితో భద్రత కల్పిస్తారు. ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇరవై నాలుగు గంటలూ పవన్ భద్రతను చూస్తారు. అదే విధంగా అలాగే రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు మూడు వాహనాలను ప్రభుత్వం సమకూరుస్తుంది.
అయితే ఏపీలో మరో మంత్రి నారా లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత ఇస్తున్నారు. ఆయనకు నలుగురు నుంచి ఆరుగురు సీఆర్పీఎఫ్ సీఐ ఎస్ ఎఫ్ కమండోలు సహా మొత్తం 22 మంది సెక్యూరిటీ బృందం 24 గంటల పాటు ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది. అలాగే కనీసం రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు నాలుగు వాహనాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే విధంగా ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు ఇరవై నాలుగు గంటలూ భద్రతను చూస్తారు.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ కే ఎక్కువ భద్రత అవసరం అన్న మాట వినిపిస్తోంది. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవన్ కి మరింత భద్రత పెంచడం అవసరం అని అంటున్నారు. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా అభిమాన జన సందోహం వెంట వస్తారు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రతను మరింతగా పెంచితేనే బాగుంటుంది అని అంటున్నారు.
మరో వైపు పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఆయన తన మార్క్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. గ్రామాలతో ముడి పడి ఉన్న శాఖలు అలాగే పర్యావరణంతో కనెక్ట్ అయి ఉన్న శాఖలు కావడంతో తన మనసునకు దగ్గరగా ఉన్న శాఖకు అని పవన్ భావిస్తున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో ఆయన పనితీరు ఎలా ఉంటుంది ఆయన ఏమి చేయబోతున్నారు అన్న చర్చ సాగుతోంది.
ఒక విధంగా పదవులు బాధ్యత. కోట్లాదికళ్ళు ఆ వైపుగానే చూస్తూ ఉంటాయి. దాంతో పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతలను నూరు శాతం న్యాయం చేస్తారు అని అంతా భావిస్తున్నారు.