కొత్త బిల్... 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్!

అయితే ఆ రెండింటికీ తేడాను గ్రహించి మెలిగే విషయంలో ఎవరి విచక్షణ వారిదని అంటుంటారు.

Update: 2024-03-27 09:15 GMT

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ఏ స్థాయిలో విస్తరించిందనేది తెలిసిన విషయమే. అయితే... ఈ మాద్యమం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అదే స్థాయిలో సమస్యలు కూడా ఉన్నాయని.. అయితే ఆ రెండింటికీ తేడాను గ్రహించి మెలిగే విషయంలో ఎవరి విచక్షణ వారిదని అంటుంటారు. అయితే... ఈ నియమం మేజర్ లకు వర్తించొచ్చు.. మరి పిల్లల పరిస్థితి? ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే వయసు రానివారి పరిస్థితి?

ఈ సమయంలోనే ఫ్లోరిడా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ప్రధానంగా చిన్నవయసులో పిల్లలు సోషల్ మీడియా కు బాగా అడిక్ట్ అయిపోతున్నారని.. హైస్కూలు దశలోనే ఆన్ లైన్ స్నేహాలకు అలవాటై, అనంతరం తప్పు దోవపడుతున్నారని రకరకాల కథనాలు వస్తున్న వేళ.. 14ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ని కలిగి ఉండకుండా నిషేధించే బిల్లుపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ సంతకం చేశారు.

ఈ సందర్భంగా... 14 లేదా 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండాలంటే... అందుకు తల్లితండ్రుల అనుమతి తప్పని సరి! ఈ నేపథ్యంలో... 14 ఏళ్ల లోపు ఖాతాలను తొలగించాలని తాజా బిల్లు సోషల్ మీడియా ఫ్లాంట్ ఫాం లను నిర్ధేశిస్తుంది. ఈ సమయంలో... ఈ ఆర్డర్ ను ఉల్లంఘించే కంపెనీలు ఒక్కో ఉల్లంఘనకు 50,000 డాలర్ల వరకూ జరిమానా విధించబడతాయని చెబుతున్నారు.

ఇక ఈ బిల్లు జనవరి 2024 నుంచి అమలులోకి వస్తుందని చెబుతున్నారు. పిల్లలను ఆన్ లైన్ ప్రమాదాల బారిన పడకుండా ఉంచడానికి తీసూన్న నిర్ణయం అని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన గవర్నర్ డిసాంటిస్... సోషల్ మీడియా పిల్లలను వివిధ మార్గాల్లో హాని కలిగిస్తోంది.. తాజాగా తీసుకున్న బిల్ వల్ల తల్లితండ్రులకు వారి పిల్లలను రక్షించే గొప్ప సామర్ధ్యాన్ని ఇస్తుందని తెలిపారు.

Tags:    

Similar News