ఎలన్ మస్క్ కి తీహార్ జైలు నుంచి లెటర్ వెళ్లింది.. ఎవరి పని అంటే?

ఇంకేముంది.. ఆ ఆర్థిక నేరగాడు ఏం చేయాలో తెలియక జైల్లో నుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడికి లేఖ రాశారు. ‘ఏ మస్క్.. నీ వ్యాపార, పరిపాలన దక్షత సూపర్.. నీ ట్విట్టర్ లో నేను పెట్టుబడి పెడుతా.. 2 బిలియన్ డాలర్లు ఇస్తాను’ అంటూ గొప్ప ఆఫర్ ఇచ్చాడు..

Update: 2025-02-26 09:30 GMT

‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా’ ఇప్పుడు జనాల సొమ్మును ఆర్థిక నేరగాడు తన పెట్టుబడులకు వాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈజీ మనీ.. జనాల నుంచి కొట్టేసిన మనీ.. వందల కోట్లు చేతిలో ఉన్నాయి.. ఇంకేముంది.. ఆ ఆర్థిక నేరగాడు ఏం చేయాలో తెలియక జైల్లో నుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడికి లేఖ రాశారు. ‘ఏ మస్క్.. నీ వ్యాపార, పరిపాలన దక్షత సూపర్.. నీ ట్విట్టర్ లో నేను పెట్టుబడి పెడుతా.. 2 బిలియన్ డాలర్లు ఇస్తాను’ అంటూ గొప్ప ఆఫర్ ఇచ్చాడు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు భారత్ లోనే పాపులర్ అయిన ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ రాసిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. రూ. 200 కోట్ల మోసం కేసులో దొరికిపోయిన నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉన్నప్పటికీ, లేఖలు రాయడం ద్వారా ఆయన తన అనుబంధాలను కొనసాగిస్తున్నాడు. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు తరచూ లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్న సుఖేశ్‌ తాజాగా ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు లేఖ రాశాడు.

-ఎక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న సుఖేశ్‌

తాను మస్క్‌కి అభిమానిగా మారిపోయినట్టు తెలిపిన సుఖేశ్‌ తన లేఖలో "నిన్ను నా మనిషిగా భావిస్తున్నా," అంటూ భజన చేశాడు. అంతేకాదు, మస్క్‌ అధినేతగా ఉన్న సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్‌’ (Twitter, ప్రస్తుతం X) లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. మొత్తం 2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నానని, ఇందులో మొదటిగా 1 బిలియన్‌ డాలర్లను వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మరో 1 బిలియన్‌ డాలర్లు వచ్చే ఏడాది పెట్టాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు.

-ట్రంప్ గెలుపు, DOGEపై అభినందనలు

లేఖలో మస్క్‌ పై ప్రశంసల జల్లు కురిపించిన సుఖేశ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపునకు మస్క్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, అలాగే DOGE వ్యవహారాలను సమర్థంగా నడుపుతున్నారని కొనియాడాడు.

- జాక్వెలిన్‌ గురించి ప్రత్యేక ప్రస్తావన

ఈ పెట్టుబడికి మరో కారణంగా తన ప్రియురాలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను పేర్కొన్నాడు. "ఎక్స్‌ మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సామాజిక మాధ్యమం. అందుకే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు. జాక్వెలిన్‌ను తన ‘లేడీ లవ్‌’ గా అభివర్ణించాడు.

- రూ. 200 కోట్ల మోసం.. బయటపడ్డ నిజాలు

సుఖేశ్‌ గతంలో మొబైల్‌ ఫోన్లు, వాయిస్‌ మాడ్యూలర్‌ సాయంతో ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్య అధితి సింగ్‌ను మోసం చేశాడు. "నేను లా సెక్రటరీ అనూప్‌కుమార్‌ను" అని నమ్మబలికి, "శివీందర్‌ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తాను," అంటూ రూ. 200 కోట్లు పైగా వసూలు చేశాడు. కొంతకాలానికి అనుమానం వచ్చిన అధితి సింగ్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

- జాక్వెలిన్-సుఖేశ్‌ అనుబంధం

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సుఖేశ్‌ – జాక్వెలిన్‌ మధ్య ఉన్న సన్నిహిత బంధం బహిర్గతమైంది. ఇద్దరి ఫొటోలు బయటకు రావడంతో జాక్వెలిన్‌ తనపై ఒత్తిడిని స్వీకరించాల్సి వచ్చింది. "సుఖేశ్‌ తనను కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు" అని ఆమె వాపోయారు.

జైల్లో ఉన్నా వార్తల్లో నిలుస్తున్న సుఖేశ్‌ లేఖలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News