కొల్లేరు ఆక్రమణలపై సుప్రీం సీరియస్.. ఉక్కుపాదంతో ఆణిచేయండి
తాజా జారీ చేసిన ఉత్తర్వులు మత్య్సకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని.. వారికి అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలని.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొన్నారు.
కొల్లేరు ఆక్రమణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని నిర్మించిన చేపల చెరువుల సంగతి తేల్చాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు.. రేఖాంశాలు ఖరారు చేయాలని ఆదేశించింది. నిర్దిష్ట గడువు లోపు కొల్లేరులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న.. పెద్ద చేపల చెరువులను నిర్దిష్ట గడువులోపు ధ్వంసం చేయాలని.. వంద ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువులను పదిహేను రోజుల్లోపు.. మిగిలిన చెరువులను 2006 మే 31లోపు తొలగించాలని నివేదిక ఇచ్చినప్పటికి ఇప్పటివరకు అమలు చేయలేదు.
చేపల చెరువుల్ని ధ్వంసం చేయాలని 2006 ఏప్రిల్ 20 నుంచే మొదలు పెట్టాలని 2006 ఏప్రిల్ పదిన సుప్రీం చెప్పినా.. ఇప్పటివరకు అమలు చేసింది లేదు. సుప్రీం ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం అమలు చేయని అంశంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 15,339 ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లుగా అమికస్ క్యూరీ తెలిపారు. 6,908.48 హెక్టార్లలో ఆక్వాకల్చర్ ఉంది. ప్రస్తుతం కోర్టు ముందు ఉంచిన సమాచారం ప్రకారం చెరువుగట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజనీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులుపెట్టి చేపల చెరువులు ఏర్పాటు చేసుకన్న వారి ప్రయోజనాల్ని రక్షించాలన్న వినతిని కోర్టు నో చెప్పింది.
డిసెంబరు 11న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం కచ్ఛితమైన డిజిటల్ మ్యాప్ లతో చిత్తడి నేలల సరిహద్దులను క్షేత్రస్థాయిలో ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆక్రమణలను తొలగించటానికి ఎలాంటి చర్యలు తీసుకున్నదీ చెప్పాలన్నారు. చిత్తడి నేతల్ని సరిగా సంరక్షించటం లేదని కోర్టుకు సమర్పించిన ఫోటోల ద్వారా తెలుస్తుందన్న సుప్రీం.. ఈ ఇష్యూను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొంది. అంతేకాదు.. ఈ మొత్తం ఇష్యూలో అధఇకారుల కుమ్మక్కును కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానించారు.
కొల్లేరు సంరక్షణ కోసం 2006ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన కె.మ్రత్యుంజయరావు గత ఏడాది డిసెంబరు ఒకటిన నాటి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వులను జారీచేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి.. జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్.. జస్టిస్ కె.వినోద్ చంద్రన్ లు ఉన్నారు. తాజా జారీ చేసిన ఉత్తర్వులు మత్య్సకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించవని.. వారికి అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలని.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొన్నారు.