హోమో సెక్స్ కేసు... సూరజ్ రేవణ్ణకు చేసే వైద్య పరీక్షలివే!?
ఈ సమయంలో... కర్ణాటక జైళ్లశాఖ అధికారులు సూరజ్ రేవణ్ణకు ఖైదీ నెంబర్ 6141 ఇచ్చారు
గతకొన్ని రోజులుగా హెచ్.డి. రేవణ్ణ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన లైంగిక వేధింపుల కేసులు కర్ణాటక రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ.. ఆ పార్టీకి చెందిన ఓ మగ కార్యకర్తను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు! ప్రస్తుతం అతడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించబడ్డారు.
ఈ సమయంలో... కర్ణాటక జైళ్లశాఖ అధికారులు సూరజ్ రేవణ్ణకు ఖైదీ నెంబర్ 6141 ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న సూరజ్ రేవణ్ణ... మగ ఖైదీలు, ఆడ ఖైదీలకూ సంబంధం లేకుండా స్పెషల్ క్వారంటైన్ లో పెట్టారని తెలుస్తుంది. ఈ సమయంలో అతడికి సుమారు 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారని అంటున్నారు.
అవును... ఈ జేడీఎస్ ఎమ్మెల్సీ స్వలింగ సంపర్కుడనే విషయం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఈ అసాధారణ లైంగిక వేదింపులకు సంబంధించిన కేసులో ఇతనికి పలు వైద్యపరీక్షలు చేయాలని నిర్ణయించారు! ఈ మేరకు బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో యూరాలజిస్టులతోపాటు మానసిక వైద్య నిపుణులు కూడా ఉంటారని చెబుతున్నారు.
సూరజ్ కు చేసే వైద్య పరీక్షలు ఇవే!?:
అసహజ శృంగారానికి సంబంధించిన కేసు కావడంతో... ఈ కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ముందుగా సూరజ్ రేవణ్ణకు లింగ పరీక్ష చేయనున్నారని తెలుస్తుంది. అనంతరం కిడ్నీ, వృషణాలను పరీక్షించనున్నారని అంటున్నారు.
అసాధారణ లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన రుజువుల కోసం మరికొన్ని ప్రత్యేక టెస్టులు ఉంటాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో బాధితుడి శరీరంపై సూరజ్ పంటి గుర్తు ఉంటే... పంటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తారని అంటున్నారు. ఇదే సమయంలో... జుట్టు, బట్టలు, కొన్ని వస్తువులనూ ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తారని అంటున్నారు. డీ.ఎన్.ఏ టెస్ట్ కూడా చేస్తారని తెలుస్తుంది.